నయనే నెంబర్ వన్
తమిళం, తెలుగు భాషల్లో నేటికీ నయనతారనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అందం ఆమెకు దేవుడిచ్చిన వరం. అయితే అభినయం ఆమె శ్రమకు ఫలితం. వెరసి ప్రేక్షకులు ఆమెకు నెంబర్‌వన్ పట్టం కట్టారు. నయనతార 2005లో అయ్యా చిత్రం ద్వారా కోలీవుడ్‌కి రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత చంద్రముఖి, గజని, శివకాశి, భిల్లా, వల్లవన్, బాస్ ఎన్గిర భాస్కరన్ మొదలగు పలు హిట్ చిత్రాలతో నెంబర్‌వన్ హీరోయిన్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. కొత్తగా ఎందరు హీరోయిన్లు వస్తున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటునే వున్నారు. తెలుగులోను టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతుండడం విశేషం. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ప్రతిఘటనలు ఎదురైనా దానిని నిబ్బరంతో ఎదుర్కొన్నారు. వాటి ప్రభావాలను నటనపై పడకుండా జాగ్రత్త పడ్డారు.
నటనకు కొద్ది రోజులు దూరం అయినా రీ ఎంట్రీలో కూడా నెంబర్‌వన్ స్థానం ఈ బ్యూటీకి దూరం అవ్వలేదు. రాజారాణి, ఆరంభం చిత్రాలు విజయం సాధించి, నయనతారను మేటి నటిగా నిలబెట్టాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే. ఆ తరువాత వరుసలో కాజల్ అగర్వాల్ నిలిచారు. ఈ భామ ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాలు తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. మూడో స్థానంలో హన్సిక, నాలుగో స్థానంలో సమంత నిలిచారు. వీరి పారితోషికం కోటి నుంచి రెండు కోట్లు వరకు ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.