
టాక్సీ డ్రైవర్‌గా..!
గాసిప్
శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్‌గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.