తమిళసినిమా: దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ పేరు ఇప్పుడు భారీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. మానగరంతో ప్రారంభమైన ఈయన దర్శక పయనం మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల వరకు విజయ పథంలో సాగుతూ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. 2024 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తారు. జీ.స్క్వాడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. కాగా ఉయిరడీ చిత్ర పేమ్ విజయకుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫైట్ క్లబ్. రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఇందులో నటి మోనీషా మోహన్ మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా తనను ఆదరించినట్లే తన నిర్మాణ సంస్థను ఆదరించాలని కోరారు. తాను డబ్బు సంపాదించడానికి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించలేదన్నారు. దర్శకుడిగా తానిప్పుడు బాగానే సంపాదిస్తున్నానన్నారు. అయితే ఆరంభ కాలంలో తాను చాలా కష్టాలను అనుభవించానని తెలిపారు.
తాను రూపొందించిన షార్ట్ ఫిల్మింస్‌కు తన మిత్రులు ఎంతో సహాయం చేశారన్నారు. వారి సాయంతోనే మానగరం చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. అలాంటి మిత్రులు, ప్రతిభావంతులను ప్రోత్సహించడం కోస మే జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ చిత్ర పరిశ్రమలోనే పెడతానని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. అలా తొలి సారిగా ఫైట్ క్లబ్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment