ఇటీవలే లియో మూవీ సూపర్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. కోలీవుడ్‌లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్‌కు కేరాఫ్‌గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్‌తో మాస్టర్, కమలహాసన్‌తో విక్రమ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి.
ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో తాను జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Need all your love and support 🤗❤️@GSquadOffl pic.twitter.com/9NWou59tuE
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 27, 2023
Comments
Please login to add a commentAdd a comment