విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్‌కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్‌మీనన్, మిష్కిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్.లలిత్‌కుమార్ నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని పలు వివాదాలను దాటుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ క్రమంలో చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో పత్రికల వారితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఇది తన ఐదవ చిత్రం అని తెలిపారు. అందరూ చిత్ర కథ గురించి అడుగుతున్నారని, అయితే ఇది కొత్త కథేమీ కాదని, మొదటి నుంచి వస్తున్న పాత కథలానే ఉంటుందని, అయితే దాన్ని తనస్టైల్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తెరకెక్కించినట్లు చెప్పారు. లియో ఎమోషనల్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు.
చిత్ర కథ మున్నార్‌లో జరిగేదిగా ఉంటుందని, అయితే అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కశ్మీర్‌లో 60 రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు. లియో చిత్రానికి ఎదురైన సమస్యల గురించి అడుగుతున్నారని, అవన్నీ నిర్మాత చూసుకుంటారని, చిత్రం ప్రారంభం నుంచి, ఫస్ట్‌కాపీ వరకూ తన బాధ్యత అని చెప్పారు. అయితే ఇలాంటి చిత్రాలకు సమస్యలన్నవి సాధారణమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా తర్వాత రెండు చిత్రాలకు కమిట్ అయినట్లు చెప్పారు. అందులో రజనీకాంత్ హీరోగా చేసే చిత్రం, కార్తీ కథానాయకుడిగా ఖైదీ 2 చిత్రం ఉంటుందని చెప్పారు. తన చిత్రాలన్నీ ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రాలుగానే ఉంటాయన్నారు. రజనీకాంత్‌తో చేసే చిత్రం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళుతుందని లోకేశ్ కనకరాజ్ తెలిపారు.
చదవండి: Leo Movie: లియోకు బిగ్ షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
Comments
Please login to add a commentAdd a comment