లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్.. ఈ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడున్నది డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాబట్టి. తమిళ స్టార్ హీరోలందరినీ ఒక్కచోటకు చేర్చే పనిలో ఉన్నాడు. ఇందుకోసం ఏకంగా యూనివర్స్‌నే సృష్టించాడు. ఈ సినిమాల్లో హీరోలతో పాటే నెపోలియన్ అనే ఓ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. ఆ పాత్ర చేసిన నటుడు.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ అతడెవరో తెలుసా?
నెపోలియన్ ఎవరు?
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో నెపోలియన్‌గా ఓ రేంజులో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడి అసలు పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టి పెరిగిన ఇతడు.. 1989లో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. అలా 13 ఏళ్ల పాటు ఇందులోనే కొనసాగాడు. 2002లో 'అళగి' మూవీతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 70 వరకు చిత్రాల్లో రకరకాల పాత్రలు చేశాడు.
(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)
60 ఏళ్లలో స్టార్‌డమ్
'ఖైదీ' సినిమాలో నెపోలియన్ అనే కానిస్టేబుల్‌గా నటించిన జార్జ్ మరియన్.. ఈ మధ్యే రిలీజైన 'లియో' సినిమాలోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో విజయ్ ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ ఎలా గోలచేశారో.. నెపోలియన్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు సేమ్ అదే రేంజులో సౌండ్ చేశారు. ఇక మూవీ చివర్లో హీరో ఫ్యామిలీని కాపాడే టైంలో ఇతడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలా 60 ఏళ్ల వయసులో స్టార్‌డమ్ సంపాదించాడు.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నెపోలియన్‌గా వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్న జార్జ్ మరియన్.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తర్వాత తీయబోయే ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల్లోనూ కనిపించడం గ్యారంటీ. ఇలా అస్సలు ఊహించని విధంగా లేటు వయసులో యంగ్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!)
Comments
Please login to add a commentAdd a comment