comedian santhanam
-
ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను
ఇకపై హీరోగానే కాకుండా సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోల చిత్రాలలో హాస్యపాత్రలూ చేస్తానని ప్రముఖ కమెడియన్ సంతానం వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం ఇనియే ఇప్పుడిదాన్. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. నటి ఆస్కా జవేరి, అఖిల్ హీరోయిన్లుగా నటించారు. దర్శక ధ్వయం మురుగన్, ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాన్ని తొలిసారిగా తానే నిర్మించి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలు నిర్మించడం సులభమేనని, విడుదల చేయడమే కష్టమవుతోందని అన్నారు. చిత్ర టైటిల్ నమోదు చేయడం నుంచి థియేటర్ల వద్దకు తీసుకురావడం వరకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం కథ సహజత్వానికి దగ్గర ఉంటుందన్నారు. కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. కమెడియన్‌గానే తనకు గుర్తింపు వచ్చిందని, కాబట్టి కేవలం హీరో పాత్రలే వేస్తానని చెప్పనని, తనకు సౌలభ్యంగా ఉండే నటులు సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ చిత్రాలలో హాస్య పాత్రలు చేస్తానని చెప్పారు. డాన్స్ నేర్చుకున్నా : తాను హీరోగా నటించడానికి సిద్ధమైన తర్వాత ఆర్య సలహాతో బరువు తగ్గానన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాల్సిన విషయం గురించి శింబు సూచనలు పాటించానని తెలిపారు. ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో తాను చూసిన కొన్ని సంఘటనలు, స్నేహితుల ప్రేమ విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రం కోసం కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని, పాటలు జనరంజకంగా వచ్చాయని సంతా నం అన్నారు. -
అంత సీన్ లేదు
ప్రతి నాయకీగా నటించేంత పరిణితి చెందలేదని, తనకు అంత సీన్ లేదని నటి భాను పేర్కొంది. తామర భర్ణి చిత్రంలో విశాల్‌కు జంటగా పరిచమైన ఈ మలయాళీ భామ ఆ చిత్రంలో కాస్త కురచగా, మరికాస్త బొద్దు, ముద్దుగా అందర్నీ అలరించింది. అయితే, ఆ తర్వాత ఈమె హీరోయిన్ గ్రాఫ్ ఏ మాత్రం ఎదగలేదు. అందుకు కారణం కుటుంబ సమస్యలు కూడా కావచ్చు. ఏది ఏమైనా ఈ మధ్య భాను మళ్లీ కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటోంది. అయితే ఆర్య, తమన్న జంటగా నటిస్తున్న వాసువుం...శరవణన్‌ను...ఎన్న పడిచ్చవంగ... చిత్రంలో హాస్యనటుడు సంతానం సరసన ప్రతినాయకీగా నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై భాను స్పందిస్తూ, ఆ చిత్రంలో ఆర్య, సంతానం ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారన్నారు. తాను సంతానం భార్యగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు ఆర్యను వెంటబెట్టుకు ఉండే సంతానం చర్యల్ని ఖండించే పాత్ర తనదిగా వివరించారు. అలాంటి పాత్ర ప్రతినాయకీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రస్తుతం మలయాళంలో యూటు...బ్రూటస్ అనే చిత్రంతో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. తమిళంలో పీవీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న శంకుతలావిన్ కాదలన్ చిత్రంలో తాను హీరోయిన్గా నటిస్తున్నట్టు పేర్కొంది. అదే విధంగా పాంబు చండై చిత్రంలో బాబి సింహాకు వదినగా నటిస్తున్నట్టు తెలిపింది. ఇలా నాయకీగా చిత్ర కథను మలుపు తిప్పే పాత్రలు పోషించడానికి తాను ఎప్పడు సిద్ధమేనని , అయితే, ప్రతి నాయకీగా నటించి మెప్పించే పరిణితి తాను ఇంకా పొందలేదని పేర్కొంది. -
సంతానం సరసన అనుష్క?
హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి అనుష్క సై అన్నట్లు కోలీవుడ్ టాక్. తెలుగులో ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన, చారిత్రాత్మక కథా చిత్రం రుద్రమదేవిలో టైటిల్ పాత్రలో నటిస్తున్న మేటి నటి అనుష్క. అదే విధంగా తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్‌కు జంటగాను నటిస్తోంది. ఈ క్రేజీ హీరోయిన్ హాస్యనటుడు సంతానం సరసన నటించడానికి అంగీకరించారంటే నమ్మశక్యం కాని విషయమే. ఇది నిజమేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్న నటించనున్నారు. ఇంతకుముందు ఆర్య హీరోగా బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు. తాజాగా అదే హీరోతో మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో సంతానం హాస్యపాత్రలో ముఖ్య భూమికను పోషించారు. దర్శకుడు రాజేష్ తాజా చిత్రంలోనూ ఆర్య, సంతానం కలిసి నటించనున్నారు. ఇందులో సంతానం ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు భావించారట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, నటుడు ఆర్య కలిసి నిర్మిస్తున్నారు. దీంతో దర్శకుడు రాజేష్ లింగా చిత్ర షూటింగ్ స్పాట్ కెళ్లి అనుష్కను సంప్రదించారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
సూర్యకు షాక్ ఇచ్చిన సంతానం