సంతానం సరసన అనుష్క? | Anushka Romance with santanam | Sakshi
Sakshi News home page

సంతానం సరసన అనుష్క?

Published Mon, Oct 13 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

సంతానం సరసన అనుష్క?

సంతానం సరసన అనుష్క?

 హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి అనుష్క సై అన్నట్లు కోలీవుడ్ టాక్. తెలుగులో ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన, చారిత్రాత్మక కథా చిత్రం రుద్రమదేవిలో టైటిల్ పాత్రలో నటిస్తున్న మేటి నటి అనుష్క. అదే విధంగా తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్‌కు జంటగాను నటిస్తోంది. ఈ క్రేజీ హీరోయిన్ హాస్యనటుడు సంతానం సరసన నటించడానికి అంగీకరించారంటే నమ్మశక్యం కాని విషయమే. ఇది నిజమేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్న నటించనున్నారు. ఇంతకుముందు ఆర్య హీరోగా బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు.
 
 తాజాగా అదే హీరోతో మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో సంతానం హాస్యపాత్రలో ముఖ్య భూమికను పోషించారు. దర్శకుడు రాజేష్ తాజా చిత్రంలోనూ ఆర్య, సంతానం కలిసి నటించనున్నారు. ఇందులో సంతానం ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు భావించారట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, నటుడు ఆర్య కలిసి నిర్మిస్తున్నారు. దీంతో దర్శకుడు రాజేష్ లింగా చిత్ర షూటింగ్ స్పాట్ కెళ్లి అనుష్కను సంప్రదించారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement