ఆర్య, అనుష్క మళ్లీ.. | Arya, Anushka together again | Sakshi
Sakshi News home page

ఆర్య, అనుష్క మళ్లీ..

Published Wed, Jun 24 2015 1:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:31 PM

ఆర్య, అనుష్క మళ్లీ.. - Sakshi

ఆర్య, అనుష్క మళ్లీ..

హీరోయిన్లందరికీ ఏకపక్షంగా నచ్చిన నటుడు ఆర్య అనే ప్రచారం ఉంది. అలాగే బిరియానీలతోనే వారిని ఆకట్టుకుంటారని అంటారు. ఎమిజాక్సన్ నుంచి నయనతార, హన్సిక,త్రిష,అనుష్క ఇలా ఆర్యను ఇష్టపడే నటీమణుల సంఖ్య చాలానే ఉందంటారు. ఆర్య ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్ర హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటారనే టాక్ కోలీవుడ్‌లో ఉంది. ఇంతకు ముందు ఆర్య, అనుష్క ఇరండామ్ ఉలగమ్ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి సన్నిహితం గురించి కథలు కథలుగా రూమర్లు దొర్లాయి. అయితే ఆ ప్రచారం గురించి ఆర్య, అనుష్క పట్టించుకోలేదు.

తాజాగా వారిపై ఆ తరహా వదంతుల ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఆర్య, అనుష్క ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో జీరోసైజ్ పేరును నిర్ణయించారు. కాగా ఇందులో ఆర్య ఫిట్‌నెస్ కన్సల్‌టెంట్‌గా నటిస్తున్నారని తెలిసింది. లావుగా ఉన్న అనుష్క ఫిట్‌నెస్ కన్సల్‌టెంట్ ఆర్య దగ్గర బరువు తగ్గడానికి తర్ఫీదు పొందడానికి వస్తుందట. రుద్రమదేవి, బాహుబలి వంటి చారిత్రక చిత్రాల్లో నటించిన అనుష్క ఈ చిత్రం కోసం బాగా బరువు పెరగడం విశేషం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆర్య, అనుష్క మధ్య మళ్లీ సాన్నిహిత్యం పెరిగిందనే ప్రచారం కోలీవుడ్‌లో హోరెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement