
తిరువళ్లూరు: కరోనా కారణంగా ఉపాధి, ఉద్యోగం లేకపోవడంతో కుటుంబంతోపాటు పస్తులుండాల్సిన పరిస్తితి ఏర్పడిందని తమను ఆదుకోవాలని హాస్యనటుడు ఇళంభారతి బుధవారం కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆవడి సమీపంలోని పాండేశ్వరం గ్రామానికి చెందిన ఇళంభారతి(35). ఇతను సినిమాల్లో ప్రముఖులతో కలిసి నటించాడు. అయితే కరోనా కారణంగా సినిమా, సీరియల్ అవకాశాలు కోల్పోవడంతో జీవనం కష్టంగా మారిందని వాపోయి ఇళంభారతి బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment