నయన్ కంటే అనుష్కే బెస్ట్ | Anushka is better than Nayanthara | Sakshi
Sakshi News home page

నయన్ కంటే అనుష్కే బెస్ట్

Published Tue, Dec 9 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

నయన్ కంటే అనుష్కే బెస్ట్

నయన్ కంటే అనుష్కే బెస్ట్

 నటి నయనతార కంటే అనుష్కనే బెస్ట్. ఇది ఇప్పుడు కోలీ వుడ్ వర్గాలంటున్న మాట. ఇందుకు కారణం లేకపోలేదు. నయనతారను ప్రస్తుతం నెంబర్‌వన్ కథానాయికి అనే వారు ఉన్నా రు. ఒక రంగా ఇది ఆమె గర్వపడే విషయమే. అయితే ఈ భామ వ్యవహార వైలి మాత్రం విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. వ్యక్తిగతంగా ప్రేమ విషయంలో పలు ఆటుపోటులను ఎదుర్కొని సుమారు ఏడాదిన్నర పైగా నటనకు దూరంగా వున్న నయనతార ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి రాజారాణి, ఆరంభం చిత్ర విజయాలతో ఫామ్‌లో కొచ్చింది. ప్రస్తుతం క్రేజీ నటిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీ ఉదయనిధి స్టాలిన్ సరసన నన్భేండా, మాజీ ప్రియుడు శింబుకు జంటగా ఇదు నమ్మ ఆళు, సూర్యతో మాస్, జయం రవి సరసన తనీ ఒరువన్ , విజయ్ సేతుపతితో నానుం రౌడీదాన్ తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 
 విజయ్‌తో ఒక చిత్రం, కార్తీకి జంటగా మరో చిత్రం అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే వున్నా నిర్మాతల్ని నిబంధనలతో ఇబ్బంది పెడుతుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్ల చిత్రాల్లో నటిస్తున్నప్పుడు మరో హీరోయిన్ తన కంటే తక్కువస్థాయి కలిగి ఉండాలని, తన పాత్రకే అధిక ప్రాముఖ్యత ఉండాలంటూ ఒత్తిడి పెంచుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల మాస్ చిత్రంలో శ్రుతిహాసన్ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆమె ఉంటే తాను నటించనని మొరాయించడంతో ఆ పాత్రకు ఎమిజాక్సన్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగిం ది. ఆమెతోను నటించడానికి ఇష్టపడకపోవడంతో చివరికి తమిళంలో ప్రాచుర్యం లేని ప్రణీతను దర్శక నిర్మాతలు ఎంపిక చేసినట్లు సమాచారం.  
 
 అనుష్క విషయానికొస్తే ప్రస్తుతం ఆమె అత్యంత భారీచిత్రాల హీరోయిన్‌గా పేరొందారు. తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి చారిత్రక కథా చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా ఎన్నైఅరిందాల్ చిత్రాల్లో నటిస్తున్నారు. లింగా చిత్రంలో మరో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా నటించారు. అదే విధం గా ఎన్నై అరిందాల్ చిత్రంలో త్రిష, పార్వతీమీనన్ అం టూ మరో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. ఇంకో విష యం ఏమిటంటే లింగా చిత్రంలో సోనాక్షి సిన్హాకు, ఎన్నై అరిందాల్ చిత్రంలో త్రిషకు అధిక ప్రాముఖ్యత ఉం టుందట. అయినా ఈ విషయాలేమీ పట్టించుకోకుండా మరే విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా దర్శకుడు చెప్పినట్లు నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారనే ప్రశంసలను అనుష్క అందుకుంటోంది. దీంతో ఇప్పుడు నయనతార, అనుష్కల ప్రవర్తనలోనూ బేరీజు వేసుకుంటూ నయనతార కంటే అనుష్కనే బెస్ట్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement