పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు | constable booked in molestations case | Sakshi
Sakshi News home page

పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు

Published Sat, Jul 26 2014 2:18 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు - Sakshi

పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు. ఓ మహిళతో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డాడు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సతీష్.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను పోలీస్ క్వార్టర్స్కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించడంతో పై అధికారులు విచారణకు ఆదేశించారు.

మహిళల పట్ల సతీష్ ప్రవర్తన సరిగాలేదని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అతని ఆగడాలు భరించలేక ఒకరు ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జంగారెడ్డి గూడెం డీఎస్పీ సుబ్బరాజు.. సతీష్ రాసలీలల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారించి పైఅదికారులకు నివేదిక పంపిస్తామని, సతీష్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement