సరికొత్త కథనంతో... | Abhinava Art Films Movie Opening | Sakshi
Sakshi News home page

సరికొత్త కథనంతో...

Aug 23 2014 10:41 PM | Updated on Sep 2 2017 12:20 PM

సరికొత్త కథనంతో...

సరికొత్త కథనంతో...

మా చిత్రకథ రొటీన్‌గా ఉంటుంది. కానీ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని నరేన్ చాలా నిజాయతీగా చెబుతున్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరత్న

‘‘మా చిత్రకథ రొటీన్‌గా ఉంటుంది. కానీ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని నరేన్ చాలా నిజాయతీగా చెబుతున్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరత్న ఆర్ట్స్ సమర్పణలో అభినవ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఓబులమ్మ నిర్మిస్తున్న చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో హీరోను ఎంపిక చేయాల్సి ఉంది. హీరోయిన్‌గా ముంబయ్‌కి చెందిన మోడల్ అర్షిఖాన్‌ని తీసుకున్నారు. మోహన్, చిన్ని సతీష్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. చిత్రవిశేషాలను నరేన్ తెలియజేస్తూ -‘‘దర్శకత్వం, ప్రొడక్షన్ శాఖలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్‌లో టాకీ పూర్తి చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement