తమిళనాడుకు కిషన్‌రెడ్డి, యూపీకి పీయూష్ గోయల్
పార్టీ ఎన్నికల అధికారులను నియమించిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: సంస్థాగత మార్పుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతిలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించేందుకు వీలుగా ప్రత్యేక ఎన్నికల అధికారుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం 29 మందితో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటకకు చెందిన లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌లను నియమించింది. వీరితో పాటు తమిళనాడుకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు పీయూష్‌గోయల్, అండమాన్ నికోబార్‌కు తమిళిసై సౌందర్‌రాజన్, బిహార్‌కు మనోహర్‌లాల్ ఖట్టర్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్‌కు భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్, పుదుచ్చేరికి తరుణ్ ఛుగ్‌లకు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment