
ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్య
చెన్నారావుపేట: ప్రేమ.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వలచిన యువతి దక్కదని ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఉప్పరపల్లికి చెందిన తాటికాయుల సతీష్(22) బీటెక్ పూర్తి చేశాడు. హన్మకొండలోని ఓ ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటి సమీపంలోని అమ్మయితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరి కుటుంబాల్లో విషయం తెలిసింది. అమ్మయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. అమ్మయి తనకు దక్కదని సతీష్ మనస్తాపం చెందాడు. హన్మకొండ నుంచి సోమవారం రాత్రి ఉప్పరపల్లికి వచ్చాడు.
గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిం చాడు. స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో సతీష్ వుృతి చెందా డు. అవ్మూరుు అన్నదవుు్మలు, వారి బంధువు లు సతీష్‌ను కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సతీష్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు.