ప్రాణాలు తీసిన సరదా | Diwali bombs tragedy in Saluru | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన సరదా

Published Sun, Oct 19 2014 2:29 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ప్రాణాలు తీసిన సరదా - Sakshi

ప్రాణాలు తీసిన సరదా

సాలూరు: ఎంతో ఆనందంగా దీపావళి జరుకోవాలని ఆ పిల్లలు ఆశించారు. దానికి కోసం ముందుగానే బాణసంచా తయారీ ప్రారంభించారు. వారు తయారు చేసుకుంటున్న  బాంబులకే బలైపోవడంతో ఆ ఇళ్లలో విషాదం అలుముకుంది. పట్టణంలోని చిన్నవీధిలో బిరుసు అప్పలస్వామి పక్క ఇంటి మేడపైకి అతని కుమారుడు బిరుసు కామేశ్వరరావు, అతని స్నేహితుడు గోక సతీష్ శనివారం ఉదయం దీపావళి బాంబులు తయారు చేసుకునేందుకు వెళ్లారు. గోడబాంబు తయారు చేసేందుకు కామేశ్వరరావు అధిక మొత్తంలో మందుగుండును కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అతని రెండు చేతులూ ఛిద్రమైపోయాయి. పక్కనే ఉన్న అతని తమ్ముడు బిరుసు గణేష్(9)కు ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి.   
 
 బాలుడిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అలాగే బాంబుల తయారీ చూద్దామన్న ఆసక్తితో వెళ్లిన మాచర్ల అనిల్‌కుమార్(16)కు కూడా ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయి.  వైద్యుల సూచన మేరకు అతన్ని విశాఖపట్నం తరలిస్తుండా   మార్గమధ్యంలోనే మృతి చెందాడు.   దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనలో ఐదో తరగతి చదువుతోన్న గోక సతీష్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అలాగే అక్కడే ఉన్న పల్లికల సుధీర్, రాకూరి ప్రదీప్, గోలిపల్లి రాజేష్‌కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
 
 వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం
 క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన మందులను బయట కొనుక్కోవాలని చెప్పడంతో బాధితుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొరతో చెప్పారు. అలాగే 108 వాహనంలో డీజిల్ వేయించమంటున్నారని, పేదలమైన తమకు అదెలా సాధ్యమవుతుందని బాధితుల తరఫున వార్డు కౌన్సిలర్ మజ్జి అప్పరావు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాజన్నదొర నేరుగా జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మృతు డు గణేష్ తల్లి దండ్రులు అప్పలస్వామి, కళావతిలను పరామర్శించారు. వీరి మరో కుమారుడు బిడ్డ కామేశ్వరరావు తీవ్రంగా గాయపడడంతో  మెరుగైన వైద్యసేవలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పరామర్శిం చిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ఉన్నారు.
 
 విచారణ జరిపిన ఏఎస్పీ
 విషయం తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చిన్నవీధిలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, విచారణ జరిపారు.  పట్టణ ఎస్‌ఐ మారూఫ్, సీఐ దేముళ్లు ఘటన జరిగిన తీరుతెన్నులను వివరించారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
 
 మందుల కొరత, వైద్యుల తీరుపై
 విచారణ జరిసిస్తాం
 పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడికి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రప్పిం చారు. ఆస్పత్రిలో మందులు లేవని చెప్పడంపై, వైద్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి కూడా కనీస ప్రథమ చికిత్స కూడా చేయకుండా రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయమై విచారణ జరిపిస్తామన్నారు.
 
 రూ 5.లక్షలు పరిహారం ఇవ్వాలి
 మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహా రం ఇవ్వాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని వైద్యులను ఆదేశించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం అందివ్వాల్సిన అవసరముందన్నారు. వయసు తక్కువగా ఉందని సాయమందించేందుకు వెనుకాడకూడదని, ఆపద్భం ధు పథకంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి   సాయం అందేలా చూస్తామన్నారు.
 
 ఆడుకుంటున్నాడనుకుని... నీటికి వెళ్లాను...’
 మృతుడు గణేష్ తల్లి కళావతి రోదన చూసి అక్కడి వారు చలించిపోయారు. ‘ఆడుకుంటున్నాడని.. నీటికి వెళ్లా ను..’ ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె రోది స్తున్న తీరు అందరికీ కంట నీరు తెప్పించింది. మరోబిడ్డ కామేశ్వరరావునైనా కాపాడండయ్యా అంటూ ఆ దంపతులు రోదించడం కలిచివేసింది. వీరికి మరో ముగ్గురు పిల్లలుండగా అందులో పెళ్లీడు వయసున్న ఆడపిల్ల ఉంది.
 
 అందొచ్చాడనుకుంటే...
 అలాగే మరో మృతుడు అనిల్‌కుమార్ తల్లి మరియమ్మ వేదన వర్ణనాతీతంగా మా రింది. ‘భర్త దూరమైనా నిబ్బరంతో పిల్లలను పెంచుకున్నాను. అందుకొచ్చావనుకుంటే అందనంత దూరం వెళ్లిపోయావా’ అంటూ ఆమె గుండెలవిసేలా రోదించా రు. ఆమెకు ఇద్దరు కుమారులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement