![Fist Song Release From Aakasavani Visakhapattanam Kendram Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/16/aakashavani-movie.jpg.webp?itok=h7MEH90w)
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ.. యూనివర్సల్ పాయింట్‌తో సతీష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ‘‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ చిత్రం డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మేకింగ్‌లో మల్లికార్జున్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కార్తీక్ మ్యూజిక్, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు.సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు సతీష్ బత్తుల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment