
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రెండో పాటని శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘మా కలల పంటగా..పుడితివే కొడుకుగా’అంటూ ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి... ఆలపించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్, దర్శకుడు సతీష్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమా కథ యూనివర్సల్ పాయింట్ కావటంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం.పెంచలదాస్ రాసి, పాడిన పాటకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో... ఈ సాంగ్ కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment