![Naa Nalla Kaluvapuvvaa Song Out From THeppa Samudram Movie - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/theppa-samudram.jpg.webp?itok=VX5MHTRw)
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుంచి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment