Theppa Samudram Movie
-
ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బిగ్‌బాస్ రన్నరప్ అంబటి అర్జున్, చైతన్యరావు హీరోలుగా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ నెలలో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీలో కిశోరి దాత్రక్ హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రాన్ని సైకో కిల్లర్ కథాంశంహా సతీష్ రాపోలు దర్శకత్వంతో తెరకెక్కించారు.తాజాగా ఈ చిత్రం తాజాగా ఓటీటీకి వచ్చేసింది. శనివారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెప్ప సముద్రం అనే ఊరిలో స్కూల్ పిల్లలకు సంబంధించిన వరుస మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. వాటిని చేధించే కథాంశంతో ఈ సినిమాను తీసుకొచ్చారు.కాగా.. బిగ్‌బాస్ సీజన్- 7లో అర్జున్ అంబటి కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. టాప్-5లో నిలిచిన అంబటి రన్నరప్‌గా నిలిచాడు. అంతేకాకుండా అర్జున్ అంబటి.. దేవత, అగ్నిసాక్షితో బుల్లితెర ఫ్యాన్స్‌ను అలరించాడు. లౌక్యం, తీస్మార్ ఖాన్ లాంటి చిత్రాల్లోనూ మెప్పించాడు. -
మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
బిగ్‌బాస్ షోలో పాల్గొని సినిమాల్లో ఛాన్సులు తెచ్చుకున్నోళ్లు తెలుగులో అయితే ఒకరిద్దరున్నారు. వీళ్లలో అర్జున్ అంబటి ఒకడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వరకు వచ్చాడు. గతంలో సీరియల్స్ చేసిన అర్జున్.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'తెప్ప సముద్రం'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వేసవిలో అంటే ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన 'తెప్ప సముద్రం' మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఆహా ఓటీటీలో ఆగస్టు 3 నుంచి అంటే ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని చూడొచ్చు.'తెప్ప సముద్రం' అనే ఊరిలో స్కూల్ పిల్లలు మాయమవుతుంటారు. దీనికి కారణం కనుక్కోవడానికి ఎస్సై గణేశ్ వస్తాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు, ఈమె ప్రియుడు ఆటో డ్రైవర్ విజయ్ కూడా పిల్లల కోసం వెతుకుంటారు. మరోవైపు గంజాయి దందాతో పిల్లల మిస్సింగ్‌కి సంబంధం ఉందని ఎస్సై తెలుకుంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రంనటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలునిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లిఎడిటర్: సాయిబాబు తలారివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘తెప్పసముద్రం’ కథేంటంటే..తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్‌ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్‌గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్‌స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్‌గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్‌కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్‌గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్‌గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
బిగ్ బాస్ అర్జున్ 'తెప్ప సముద్రం' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన సినిమా 'తెప్ప సముద్రం'. సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. పి. ఆర్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!) ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాట, ట్రైలర్ ని వీళ్లు లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) -
Theppa Samudram: కంటతడి పెట్టిస్తున్న పెంచల్ దాస్ పాట
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుంచి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. -
Theppa Samudram: మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవడు?
బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా, కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివరాత్రి సందర్భంగా తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ చూస్తే అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. చూస్తుంటే 2015 లో తెలంగాణాలో హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది. మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అయిందాక వెయిట్ చేయాల్సిందే. అల్లరి నరేష్ మాట్లాడుతూ..‘ తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్లర్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం
అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్పై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రక్ హీరోయిన్గా నటిస్తుంది. మరో కీలకపాత్రను బొమ్మాళి రవిశంకర్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సింగర్ మంగ్లీ పాడిన మాస్ బీట్ సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక టేబుల్ వెనుక చొక్కా వేసుకుని, దానిపై కాకీ చొక్కా వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది రివీల్ చేయకుండా సస్పెన్స్‌ని క్రియేట్ చేశారు. టేబుల్‌పై ఆ వ్యక్తి చేతులు పెట్టి ఉండటం. ఒక చేతి కింద భగవద్గీత వుండటం, మరో చేతిపై కత్తితో పొడిచి ఉండటం కనిపిస్తుంది. ఆ టేబుల్ ముందు భాగంలో ధర్మానికి ప్రతీకైన జాతీయ చిహ్నం ఉంటుంది. మరో పక్క శాంతికి చిహ్నమైన పావురం ఉండటం గమనించవచ్చు. నిల్చున్న వ్యక్తి వెనుక లా బుక్స్ వుండటంతో పాటు ఒక పవర్ఫుల్ కొటేషన్‌తో ముందుకొచ్చారు. “భగవద్గీత మహాభారతంలో ఒక భాగం కాదు.. మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం.. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు.. మనిషి గ్రంథం..” అనే కొటేషన్‌లోనే అర్థం అవుతుంది భగవద్గీత గురించి ఎంత లోతుగా చెప్పబోతున్నారనేది. ఇప్పటివరకు భగవద్గీతను ఒక మతానికి చెందినది అనేది మాత్రమే అందరూ అనుకుంటున్నారు. కానీ భగవద్గీత కేవలం ఒక మతానికి కాదు మనిషులందరికీ సంబంధించినది అనేది ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.