ధర్మవరం: తాగిన మత్తులో కన్నకొడుకును రైలు కింద విసిరాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో చిన్నారి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కదిరి రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న మురళి, శంకరమ్మ దంపతులు ఇనుప వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు
. ఈ క్రమంలో ఇనుప వస్తువలను ఏరుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చిన వారు తమతో పాటు నాలుగేళ్ల చిన్నారి సతీష్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న మురళి రైలు కదులుతున్న సమయంలో సతీష్‌ను రైలు కింద పడేశాడు. ఈ ప్రమాదంలో చిన్నారి చేతి వేళ్లు తెగిపోయి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన రైల్వే పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరించారు. మురళిని అదుపులోకి తీసుకున్నారు.