రైలు ఢీకొని.. రెండు కాళ్లు తెగి..
ధర్మవరం అర్బన్ : ధర్మవరం గాంధీనగర్ రైల్వే ట్రాక్ వద్ద శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు రైలు కిందపడి మహేశ్(11) అనే విద్యార్థి రెండు కాళ్లు తెగిపోయాయి. ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మిదేవి, నల్లప్ప దంపతుల కుమారుడైన మహేశ్ స్థానిక రైల్వే మున్సిపల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితునితో కలసి ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి బహిర్భూమికి వెళ్లాడు.
కంకరపై నడుస్తున్న మహేశ్ కాలుజారి రైలు కిందపడిపోయాడు. దీంతో అత ని రెండుకాళ్లు తెగిపోయాయి. స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.