వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది! | Woman Cuts off Husband's Penis in hyderabad | Sakshi
Sakshi News home page

వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది!

Published Tue, Mar 3 2015 9:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది! - Sakshi

వేధిస్తున్నాడని.. భర్త మర్మాంగం కోసింది!

హైదరాబాద్: అనుమానంతో వేధిస్తున్న భర్తను అంతమొందించేందుకు ఏకంగా అతని మర్మాంగాన్ని కోసిందో భార్య. బాధితుడు ప్రస్తుతం చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ బి.మహేందర్ కథనం ప్రకారం... మెహిదీపట్నం అంబేద్కర్‌నగర్ లో సతీష్(35), భార్య (30), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.  సతీష్ కూలీ కాగా.. భార్య ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ పని చేస్తోంది. సతీష్ భార్యను అనుమానించడంతో పాటు మద్యానికి బానిసై వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక భార్య అతడిని అంతమొదించాలనుకుంది.

ఆదివారం రాత్రి పీకలదాక తాగివచ్చి నిద్రలోకి జారుకున్న భార్తను చంపేందుకు ఇంట్లోని కొడవలితో మర్మాంగాన్ని కోయడానికి యత్నించింది. గాయపడ్డ సతీష్ కేకలు వేయడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకొని అదే రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి మూలుగుతున్న శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తాళాలు పగులగొట్టి చూడగా సతీష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే 108కు పోలీసులు సమాచారం ఇచ్చి అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement