నడిరోడ్డులో భార్యపై హత్యాయత్నం.. | Husband Drives Car Against Wife After Divorce Demand | Sakshi
Sakshi News home page

నడిరోడ్డులో భార్యపై హత్యాయత్నం..

Published Wed, Jun 6 2018 3:25 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

Husband Drives Car Against Wife After Divorce Demand - Sakshi

హత్యాయత్నం సమయంలో ఫుటేజి

ఖబరోవ్‌స్క్‌, రష్యా : భార్యపై కోపంతో రగిలపోయిన ఓ భర్త ఆమెపై హత్యాయత్నం చేశాడు. విడాకులు ఇవ్వాలని డిమాండ్‌ చేసి కారు దిగి వెళ్లిపోతున్న భార్యను కారుతో తొక్కించి చంపబోయాడు. ఈ ఘటన రష్యాలోని ఖబరోవ్‌స్క్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌లో ఆగివున్న కారులోంచి భార్య, భర్త గొడవపడుతున్న శబ్దాలను చుట్టుపక్కల వాహనదారులు విన్నారు. వివాదం మరింత ముదరటంతో భార్య తనకు విడాకులు కావాలని భర్తను డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత కారు దిగి వెళ్లిపోయింది.

అయితే, భార్య ప్రవర్తనతో కోపాన్ని అదుపు చేసుకోలేని భర్త కారును వెంటనే యూ టర్న్‌ తీసి ఆమెపైకి పోనిచ్చారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. అదృష్టవశాత్తు ఆమె గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. వాహనదారుల సమాచారంతో అక్కడిచేరుకుని భార్యను ఆసుపత్రిలో చేర్పించి, భర్తను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement