గోదావరిఖని: గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట 2010 నవంబర్ 6న రాత్రి పవర్‌హౌస్‌కాలనీకి చెందిన మాజీ నేరస్తుడు, రౌడీషీటర్ పిడుగు సతీశ్ (24)ను కత్తులతో పొడిచి హత్య చేసిన నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి వెంకటకృష్ణయ్య తీర్పు చెప్పారు. సతీష్ హత్య కేసులో మొత్తం ఏడుగురిపై 302, 324, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఏ1గా ఉన్న కట్టెకోల సుధీర్ 2012 జూన్ 10వ తేదీన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
ఏ4గా ఉన్న నరేందర్‌పై నేరం రుజువు కాలేదు. ఏ6గా ఉన్న టీకే శ్రీనివాస్ అనే మాజీ నేరస్తుడు కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. మిగిలిన నీలపు రవిబాబు, ఆయన సోదరుడు నీలపు వంశీకృష్ణ, ధనాల శేఖర్, దాసరి ప్రేమ్‌కుమార్‌పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఒక్కోక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా కూడా విధించారు.
హతుడు, హంతకులు స్నేహితులే..
పిడుగు సతీష్ ను పథకం ప్రకారం నమ్మించి హత్య చేసింది అతని స్నేహితులే. సతీష్, అతని స్నేహితులు గొడవలు, ఘర్షణలతో కా లం గడిపేవారు. 2010 జనవరి 8వ తేదీన కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనికి చెందిన నాగరాజు, ఆయన తండ్రి శంకర్‌ను దారుణంగా హత్య చేశారు.
తర్వాత బెయిల్‌పై వచ్చిన సతీష్ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు సతీష్‌కు చెందిన బంధువు విషయంలో స్నేహితుడైన కట్టెకోల సుధీర్ అసభ్యంగా ప్రవర్తించడంతో సహించ ని సతీష్ సుధీర్‌ను హెచ్చరించాడు. దీంతో సుధీర్ తన స్నేహితులను పిలిపించుకుని సతీష్‌తో కలిసి గోదావరిఖని బస్టాండ్ కాలనీ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సతీష్‌ను దారుణం గా హత్యచేశారు.
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
Published Sat, Apr 18 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement