జీలుగుమిల్లిలో కానిస్టేబుల్ రాసలీలలు
- పోలీస్ క్వార్టర్స్ అడ్డగా శృంగార కార్యకలాపాలు
- కెమెరాలో బంధించిన స్థానికులు
- క్వార్టర్స్‌ను పరిశీలించిన డీఎస్పీ సుబ్బరాజు
జంగారెడ్డిగూడెం : జీలుగుమిల్లి పోలీస్ క్వార్టర్స్ అడ్డాగా ఒక కానిస్టేబుల్ సాగిస్తున్న రాసలీలలు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తించింది. జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వైపు రహదారిలో రోడ్డు పక్కనే ఉన్న ఈ క్వార్టర్స్‌లో పట్టపగలే కానిస్టేబుల్ పి.సతీష్ రాసలీలలు సాగిస్తున్నాడని తెలుసుకున్న స్థానికులు కొందరు రహస్యంగా కెమెరాతో చిత్రీకరించారు. దీంతో వ్యవహారం గుప్పుమంది. గతంలో ఇతని తీరుపై ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో తాజా ఘటనపై డీఎస్పీ సుబ్బరాజు స్పందించి శనివారం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించారు.
కానిస్టేబుల్ వ్యవహారశైలిపై విచారణ చేశారు. అతనిపై స్థానికులు ఇటువంటివే అనేక ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చన్నారు. ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై విచారణాధికారిగా జంగారెడ్డిగూడెం సీఐ అంబికా ప్రసాద్‌ను నియమించినట్టు చెప్పారు.
అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కాగా సదరు కానిస్టేబుల్ పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తూ జీలుగుమిల్లికి బదిలీపై వచ్చారు. కానిస్టేబుల్ వ్యవహారంపై గ్రామస్తుల్లో కూడా కొంత అసహనం ఏర్పడినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే రాసలీలలు సాగిస్తున్న సతీష్‌పై నిఘా పెట్టి గుట్టురట్టు చేశారని చెబుతున్నారు.
క్వార్టర్స్‌ను పరిశీలించిన డీఎస్పీ సుబ్బరాజు