కరీంనగర్ క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత నిండు ప్రాణాలు బలిగొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లా జా అపార్ట్‌మెంట్‌లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇన్‌క్లైన్ కాలనీకి చెందిన ఆకుల ఓదెలు–లక్ష్మిల రెండో కుమార్తె సరిత మంచిర్యాల జి ల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది. గోదావరిఖనిలో నివసిస్తున్న వారికి ఆస్మిత్‌రెడ్డి, మణిత్‌రెడ్డి సంతానం. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం నచ్చని శ్రీపాల్‌రెడ్డి అందుకు అభ్యంతరం తెలిపాడు.
ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలకు దారితీయడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్తుండే ది. ఈ క్రమంలో భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్‌మెంట్ 203 ఫ్లాట్‌లో ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. దీంతో సరిత సుమారు రూ. 20 లక్షలకుపైగా డబ్బును వెంకటేశ్‌కు ఇచ్చింది.
సరిత తమ్ముడు ఆకుల సతీశ్ నగరంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో కుమారులతో సహా సరితత మ్ముడి ఇంట్లోనే ఉంది.జూన్ 28న కొడుకులను గోదావరిఖని పంపిన సరిత అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్‌కు వెళుతున్నానని చెప్పింది. ఆమె సోదరుడు మర్నాడు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం సరిత ఫోన్ నుంచి ఆకుల సతీశ్‌కు వెంకటేశ్ వాట్సాప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుందని, ఫ్లాట్ లోపలే ఉందని, ఆమెను తాళం పగలగొట్టి తీసుకెళ్లాలని చెప్పి పరారయ్యాడు.
దీంతో కంగారుపడిన సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్... హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిచూడగా రక్తపు మడుగులో, ముఖం, తలపై తీవ్రగాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. సతీశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధా న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక లావాదేవీలే కారణం...
సరిత మృతికి వ్యాపార లావాదేవీలే కా రణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ. 25 లక్షలను పెట్టుబడి కింద వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందన్నారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వా లని అడగడంతో వెంకటేశ్ ఇవ్వలేదని.. దీనిపై ఇద్దరికీ గొడవలు జరిగేవని సతీశ్ తెలిపాడు. వెంకటేశ్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్ సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment