కన్నబిడ్డకు కష్టమొచ్చిందని.. | Who is the son of the current shock | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డకు కష్టమొచ్చిందని..

Published Thu, Aug 7 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

ఒక్కగానొక్క కుమారు డు కావడంతో అల్లారుముద్దుగా పెం చుకుంది. ఆశలన్నీ అతనిపైనే పెట్టుకుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న తరుణంలో...

  •      కరెంట్ షాక్‌కు గురైన కుమారునికి కాలు, చేయి తీసేశారని మనస్తాపం
  •      తిండీతిప్పలు మాని ప్రాణాలు విడిచిన తల్లి
  • యాదమరి: ఒక్కగానొక్క కుమారు డు కావడంతో అల్లారుముద్దుగా పెం చుకుంది. ఆశలన్నీ అతనిపైనే పెట్టుకుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న తరుణంలో కరెంట్ తీగల రూపంలో పిడుగులాంటి కష్టమొచ్చి పడింది. విద్యుత్ షాక్‌కు గురైన కొడుకుకు కాలు, చేయి తీసేయడంతో తట్టుకోలేకపోయింది. తిండీ తిప్పలు మానే సి చివరకు తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన యాదమరి మండలం కోణాపల్లెలో చోటుచేసుకుంది.
     
    కోణాపల్లె గ్రామానికి చెందిన మలర్‌కుడి, మైకల్ దంపతులకు సతీష్(15), బేబిషాలిని పిల్లలున్నారు. గ్రామంలో ఇటీవల కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటున్నా రు. ఈ తరుణంలో గత నెల 12వ తేదీ సతీష్ మిద్దెపై ఆడుకుంటుం డగా చేతికందే ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండడం తో వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్పించారు.

    అతనికి ఎడమకాలు, కుడి చెయ్యి తొలగించారు. దీన్ని చూసి మలర్‌కుడి మనస్తానానికి గురైంది. ఆ రోజు నుంచి తిండీ తిప్పలు మానే సింది. పది రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పిం చినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఆమెను జీడీనెల్లూరు మండలం నెల్లెపల్లెలో ఉన్న అమ్మగారింటికి పంపా రు. జ్వరం వస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం తిరుపతికి తీసుకెళుతుండగా దేవళంపేట వద్దకు రాగానే పడిపోయి ప్రాణాలు వది లింది. కోణాపల్లెలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
     
    విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే..
     
    ఇంటిపై 11 కేవీ విద్యుత్ తీగలు ఉండడంతో వాటిని తొలగించాలని మలర్‌కుడి దంపతులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులను కోరారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement