తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు
‘తానా’ అధ్యక్షుడు సతీష్ వేమన
రాజమహేంద్రవరం సిటీ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నదని ఈ సంఘం అధ్యక్షుడు (2017) సతీష్ వేమన పేర్కోన్నారు. బుధవారం చైతన్యస్రవంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ తానా 2017 మే 28తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఏటా జూలైలో నిర్వహించే ఉత్సవాలను ఈసారి మే 28నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాలలో తానా కార్యాక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. గన్ని సతీష్‌కు మొక్కను అందజేశారు. ఆయన వెంట సినీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఉన్నారు,