Vemana
-
శతకాలు : చూడచూడ రుచుల జాడ వేరు
పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య వేరయావిశ్వదాభిరామ వినుర వేమ – (వేమన )తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్వడి గల యెద్దుల కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ– (బద్దెన)తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
19న వేమన జయంతి
సాక్షి, అమరావతి: తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన తొలిసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సత్యసాయి జిల్లా కటారుపల్లెలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు. మల్లికార్జునరావు స్వయంగా గీసిన వేమన చిత్రపటాన్ని గురువారం ఆవిష్కరించి 19న నిర్వహించనున్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా కటారుపల్లెలో నిర్మించిన వేమన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వేమన జీవితానికి, ఆయన బోధనలకు, జ్ఞానాన్ని పొందిన విధానానికి రూపం ఇస్తూ తాను చిత్రాన్ని గీశానని, దానిని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలోని మూఢనమ్మకాలను వేమన తన కవిత్వంతో ఖండించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
వేమన విగ్రహానికి అగ్రస్థానం
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహానికి మరింత ప్రాధాన్యత కల్పించామని, దీనిని గుర్తించకుండా రాజకీయం చేయడం తగదని వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘విశ్వవిద్యాలయంలో ఎక్కడా కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. తొలగించనూ లేదు. వేమన విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖ ద్వారం వద్ద గత నెల 31న ఏర్పాటు చేయడంతో ఖాళీ అయిన స్థానంలో వైవీయూ వ్యవస్థాపకుడు వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశాం. ఈ మార్పు వల్ల వేమనకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఇదివరకు లోపలికి వస్తే కానీ కనిపించని వేమన విగ్రహం.. ఇప్పుడు ప్రధాన ద్వారం వద్దే అందరికీ బాగా కనిపిస్తుంది. ఈ వాస్తవం కళ్లెదుటే కనిపిస్తున్నా, దీనిని రాజకీయం చేయడం సరికాదు’ అని అన్నారు. ఇదిలా ఉండగా, ఆ పత్రికల్లో సాగిన దుష్ప్రచారంపై విశ్వవిద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ పత్రికలు తప్పుడు వార్త ప్రచురించాయని తెలిసింది. వేరే ఊళ్లలో ఉంటున్న వారు అదే వాస్తవమని నమ్మే ప్రమాదం ఉంది. అమ్మో.. ఇంత భయంకరంగా, పచ్చిగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతారా?’ అని అన్నారు. -
కన్నడంలోకి ప్రజాకవి వేమన
డాక్టర్ ఎన్.గోపి పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం ‘ప్రజాకవి వేమన’ కన్నడ భాషలోకి అనువాదమైంది. ధార్వాడ్ కర్ణాటక విశ్వవిద్యాలయంలోని మహాయోగి వేమన పీఠం వారు ఇటీవలే దీనిని ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు డాక్టర్ ఆర్.శేషశాస్త్రి అనువాదకులు. కర్ణాటక విశ్వవిద్యాలయం కులపతి(కులపతి గళు) ప్రొఫెసర్ ప్రమోద భీగాయ ముందుమాట రాస్తూ– కన్నడంలోని సరజ్ఞునిలాగే వేమన ఒక ‘జనపర కవి’(ప్రజాకవి), సంత కవి(యోగి కవి) అనీ, అతని పైన ప్రామాణిక పరిశోధనతో వెలువడిన గ్రంథాన్ని తెలుగులోకి తెచ్చుకోవడం ముదావహమనీ అన్నారు. ఇంతవరకు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలన్నింటి నుంచి దాదాపు నాలుగు వేల థీసీస్సులు వచ్చాయని అంచనా. వాటిలో ఇరవై దాకా మాత్రమే ప్రామాణికమై, పఠన పాఠవాల్లో నలుగుతూ, ఉటంకింపుల కాలవాలమై పరామర్శ గ్రంథాలుగా నిలిచాయని కాలం చెబుతున్న తీర్పు. వాటిలో ప్రజాకవి వేమన ఆరు ముద్రణలు పొందడం ఒక రికార్డు. ఇది తొలిసారి 1980లో అచ్చయింది. అచ్చుపుస్తకాలతో ఆగక తాళపత్ర గ్రంథాల మూలాల్లోకి వెళ్లి, విశేష పరిశ్రమ కోర్చి తీర్చిన రచనగా గౌరవానికి నోచుకుంది. ఈ పరిశోధనతో ‘వేమన గోపి’ అంటూ వేమన ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చేసిన పని పరంగా ప్రసిద్ధి కలగడం ఆ పని నాణ్యతకూ దానికి లభించిన పాఠకాదరణకూ నిదర్శనం. ఇక కన్నడానువాదానికి అనుకూలమైన నేపథ్యాన్ని గురించి ఒకటి రెండు మాటలు. 17వ శతాబ్దానికి చెందిన వేమన దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాడనడానికి దాఖలాలున్నాయి. ముఖ్యంగా కన్నడ దేశంలో. ఉత్తర కర్ణాటక, బళ్లారి, కొలార్ జిల్లాలు, బెంగళూరు ప్రాంతాల్లో ఎందరో తెలుగు వారున్నారు. ఎన్నో వేమన ఆశ్రమాలున్నాయి. లక్షల సంఖ్యలో వేమన భక్తులున్నారు. 10, 12 తరాలుగా తెలుగు మరిచిపోయినా వేమనను ఆరాధిస్తున్నారు. అల్లర చిల్లరగా తిరిగే వేమన్న మనసు మార్చి యోగిగా పరివర్తనకు కారణమైన వేమన్న వదిన ‘వేమారెడ్డి మల్లమ్మ’ కన్నడ దేశంలో నిత్యపూజలు అందుకుంటున్నది. వేమన్న ప్రేమికులు కర్ణాటకలో ఇప్పుడదొక ఓటుబ్యాంకు. గోపి గారు బెంగళూరులోని విధాన సౌధలో వేమనపై యావత్ ప్రజాప్రతినిధుల ముందు ప్రసంగించి, అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా సన్మానం పొంది వచ్చారు. అప్పటి రెవెన్యూ మంత్రి హెచ్.కె.పాటిల్ చొరవతోనే వేమన పీఠం స్థాపన జరిగింది. ఆయన పినతండ్రి ఎస్.ఆర్.పాటిల్ 400 వేమన పద్యాలను కన్నడంలోకి అనువదించారు. యోగి జీవితం గడిపారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో ఆ మాటకొస్తే యావద్భారతంలోనే కబీరుకున్న ప్రాచుర్యం మరే కవికీ లేదు. హిందీలో ఉండటం వల్ల కూడా అది సాధ్యమైంది. వేమన పద్యాలు కబీరు దోహాల కన్న ఏమాత్రం తక్కువవి కావు. కాని వేమన దురదృష్టం ఏమిటోగాని ఆయన ఇంటినే సరిగ్గా గెలవలేక పోయాడు. తెలుగు సమాజమంతా ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయమిది. వేమన హిందీలోకి అనువదించబడితే అఖిల భారత కవిగా మారిపోతాడు. కబీరు, వేమన ఇద్దరూ సంత్ కవులే. వేషధారులను దునుమాడి తాత్త్విక స్పష్టత కోసం పాటుపడిన వారే. ముఖ్యంగా నేటితరం జీవన సంక్షోభంలో పడి కొట్టుకుపోతున్న తరుణంలో వేమన్న ప్రబోధాల అవసరం చాలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ సాంస్కృతిక సంస్థలు దీనిపై దృష్టి పెట్టవలసి ఉంది. -డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ -
జగన్‌ను సీఎం చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి : రోజా
సాక్షి, నరసరావుపేట రూరల్: జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే వై.ఎస్. రాజశేఖరరెడ్డికి ఆయన అభిమానులు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే ఆర్.కె. రోజా అన్నారు. కోటప్పకొండలోని యోగి వేమన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ల సత్రంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన, గురవాయపాలెంలో వై.ఎస్. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో చిన్నచిన్న విబేధాలను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలపుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తెలుగుదేశం పార్టీ కోనుగులు చేసిందని, వారిపై స్పీకర్ కోడెల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అరాచకాలకు పాల్పడుతున్న ఆయన్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుడూ టీడీపీ దోపిడి పాలన అంతమొందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, యెగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, అధ్యక్షుడు గాయం కృష్ణారెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, మోదుగుల పాపిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎన్. యజ్ణనారాయణరెడ్డి, మాగులూరి రమణారెడ్డి, గానుగపంట ఉత్తమరెడ్డి, మూరే రవీంద్రారెడ్డి, సి.వి. రెడ్డి, మద్దిరెడ్డి నర్సింహరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన వన భోజనాల్లో 18వేల మంది పాల్గొన్నారు. -
ఎంఎంబీజీ విద్యార్థుల ప్రపంచ రికార్డు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి ఖాదీకాలనీలోని మేక్ మై బేబి జీనియస్(ఎంఎంబీజీ) పాఠశాల విద్యార్థులు రెండు ప్రపంచ రికార్డులు సాధించారు. 265 మంది విద్యార్థులు కేవలం 19.11 నిమిషాల్లో వంద వేమన పద్యాలను పఠించి తమ జ్ఞాపకశక్తిని చాటుకున్నారు. మేక్ మై బేబి జీనియస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆ పాఠశాల ఆవరణలో అద్భుత మెమొరీ విన్యాసాన్ని చిన్నారులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను రికార్డు చేసేందుకు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కో–ఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కో–ఆర్డినేటర్ గుర్రం స్వర్ణశ్రీ హాజరయ్యారు. వీరి సమక్షంలో మూడు నుంచి 14 ఏళ్ల వయస్సు చిన్నారులు ఒకే సారి వంద వేమన పద్యాలను పఠించి రికార్డును చేజిక్కించుకున్నారు. వీరందరికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధరశాస్త్రి, కావలికి చెందిన అధ్యాపకులు మణి అన్నదాత(ప్రాస మణి), గుంటూరులోని హిందూ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు, గాంధేయవాది కొత్తపల్లి సీతారాం, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్.విశ్వనాధరెడ్డి హాజరై మాట్లాడారు. వివిధ అవార్డులు ప్రదానం.. మేక్ మై బేబి జీనియస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గురువులకు వివిధ అవార్డులు ప్రదా నం చేశారు. వంద వేమన పద్యాలను పఠించిన 265 మంది చిన్నారులకు వేమన శతకరత్న, శ్రీమద్భగవద్గీతలోని 2 అధ్యాయాలను పఠించిన 7 ఏళ్లలోపు 20 మంది చిన్నారులకు గీతాబాల, 5 అధ్యాయాలు పఠించిన 28 మంది చిన్నారులకు గీతాఝరి, 18 అధ్యాయాలు పఠించిన అయిదుగురు చిన్నారులకు గీతాసాగర అవార్డులను ప్రదానం చేశారు. అలాగే 100 వేమన పద్యాలను నేర్పిన గురువులు తొమ్మిది మందికి శతకరత్నాకర, శ్రీమద్భగవద్గీత నేర్పిన గురువులు ఐదుగురుకి గీతోపదేశిక అవార్డులను అందజేశారు. -
చిన్నారి కాదు.. చిచ్చర పిడుగు
చేర్యాల(సిద్దిపేట) : ఆరున్నరేళ్ల వయసులోనే వంద పద్యాలను చూడకుండా పాడిన బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా, చేర్యాలలోని గాయత్రి హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రేష్ట ఈ ఘనత సాధించింది. చేర్యాలకు చెందిన శివగారి కిరణ్, రజని దంపతుల కుమార్తె శ్రేష్ట ప్రవస్థి 18 నిమిషాల్లో వేమన శతకంలోని 100 పద్యాలను చూడకుండా పాడి రికార్డు సాధించింది. కాగా, శ్రేష్ట ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో నిర్వహించిన బాలకవి సమ్మేళనంలో పాల్గొని 52 పద్యాలు పాడి అందరి మన్ననలు పొందింది. త్వరలోనే వంద పద్యాలు పాడి రికార్డు సాధిస్తానని చెప్పింది. అన్నట్టుగానే వేమన శతకాన్ని 18 నిమిషాల్లో చూడకుండా చదివి వినిపించి రికార్డు సృష్టించింది. -
ఆధునిక వైతాళికుడు వేమన
– వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సులో వక్తలు – ఆకట్టకున్న కళారూపాలు అనంతపురం కల్చరల్ : తెలుగు సాహిత్యానికి వినూత్న రూపమిస్తూ.. మధ్యయుగంలోనే సమాజాన్ని మేల్కోపిన ఆధునిక వైతాళికుడు వేమన అని పలువురు రచయితలు, విద్యావేత్తలు అన్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన రచయితలు, కవుల ప్రసంగాలలో వేమన సాహిత్య ప్రతిధ్వనించింది. వేమన సదస్సుకు ప్రముఖ సాహితీ విమర్శకులు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించి పలువురు సాహితీ వేత్తలను సభకు పరిచయం చేశారు. వేమన సదస్సు ప్రాముఖ్యతను కార్యక్రమ ఆహ్వాన కమిటీ కార్యదర్శి పిళ్లా కుమార స్వామి వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తదితరులతో పాటు ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య గోపి, ఎస్వీ యూనివర్శిటీ మాజీ వీసీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత కథా రచయితలు డాక్టర్ శాంతి నారాయణ, సింగమనేని నారాయణ, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేమన సాహిత్యంలోని ప్రత్యేకతను, సంఘ సంస్కరణాభిలాషను వివరించారు. గురజాడ, శ్రీశ్రీల అభ్యుదయ భావనలకు స్ఫూర్తినిచ్చిన వేమన చిరస్మరణీయుడని, ఆయన సాహిత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్తున్నా ప్రస్తుత రోజుల్లోనూ మధ్యయుగం నాటి రుగ్మతలు మాసిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢాచారాలను ఆనాడే ఖండించిన వేమన ఆలోచనా విధానాన్ని ఈతరం వారు అనుసరించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేమన సాహిత్య ఆవిష్కరణ పలువురు రచయితల కలం నుంచి వేమన సాహిత్యంపై జాలువారిన 14 పుస్తకాలను ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. వేమన సాహిత్యంపై ఆచార్య గోపి రచించిన ‘ప్రజాకవి వేమన, ‘వేమన వెలుగులు’, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ‘నిత్య సత్యాలు వేమన పద్యాలు’, కె.ఎల్ కాంతారావు, ఉషారాణి, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి సంపాదకీయంలో వచ్చిన వ్యాస సంకలనాలు, గుర్రం వెంకటరెడ్డి పాచన రామిరెడ్డి ‘వేమన–ఇతర భారతీయ కవులు’, ‘వేమన–పునర్మూల్యాంకనం’ తదితర పుస్తకాలను ఆవిష్కరమయ్యాయి. పుస్తకాలను ఉషారాణి, ప్రజాశక్తి లక్ష్మయ్య పరిచయం చేశారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన సదస్సుల్లో వేమన విశిష్ట శైలిపై ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆర్డీటీ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి, జనప్రియ కవి ఏలూరు ఎంగన్న, రచయిత్రి మధు జ్యోతి, కెరె జగదీష్, డాక్టర్ రాధేయ, రాజారామ్ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, జెట్టీ జైరామ్, సూర్యసాగర్ తదితరులు ప్రసంగించారు. అలరించిన కళారూపాలు ప్రజా నాట్య మండలి కళాకారుల ప్రదర్శన అందరిని అమితంగా అలరించింది. ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు బాషా నేతృత్వంలో ఆలోచనాత్మకంగా సాగిన దృశ్య రూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేమన సాహిత్య ప్రచారం ఆకట్టుకుంది. కార్యక్రమంలో సదస్సు జిల్లా నిర్వాహకులు రవిచంద్ర, నానీల నాగేంద్ర, రసూల్, సూర్యనారాయణరెడ్డి, షరీఫ్, కృష్ణవేణి, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎందరికో ఆదర్శం వేమన
- ఆలోచింపజేసిన కళాజాత - ప్రారంభమైన వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సు అనంతపురం కల్చరల్ : ప్రజాకవి వేమన ఎందరికో ఆదర్శమని ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు తెల్కపల్లి రవి, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, ఆచార్య గోపి, డీఎస్పీ మల్లికార్జునవర్మ అన్నారు. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు పేరిట అనంత వేదికగా రెండురోజుల పాటు సాగే ఉత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానిక మునిసిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేమన సదస్సు ఆహ్వాన కమిటీ కార్యదర్శి కుమారస్వామి అధ్యక్షత వహించారు. తెల్కపల్లి రవి, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, ఆచార్య గోపి, డీఎస్పీ మల్లికార్జునవర్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వేమన స్ఫూర్తిదాయక జీవితం గురించి మాట్లాడారు. ఆటవెలది పద్యాలతో జీవిత సత్యాలను వేమన తెలియజేశారని గుర్తుచేశారు. నాడు సమాజంలో నెలకొన్న మూఢాచారాలు, కులతత్వాన్ని నిరసించి మహాకవులకు వేమన ఆదర్శప్రాయంగా నిలిచాడని కొనియాడారు. ఆకట్టుకున్న కళారూపాలు అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులు రూపొందించిన కళాజాత ఆహూతులను ఉర్రూతలూగించింది. రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసిన ప్రజా నాట్యమండలి కళాకారులు వేమన సాహిత్య ప్రాధాన్యం తెలిపే నృత్యరూపకాలను అద్భుతంగా ప్రదర్శించారు. వేమన సాహిత్యాన్ని దృశ్యరూపకాలతో అనుసంధానం చేస్తూ చైతన్యవంతం చేయడమే లక్ష్యమని కళాబృందాలకు నేతృత్వం వహించిన ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు బాషా అన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుసంధానంగా మధ్యయుగం నాటి సమాజ వ్యవస్థను పోలుస్తూ సాగిన రూపకం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, జట్టీ జైరామ్, సదస్సు జిల్లా నిర్వాహకులు రవిచంద్ర, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కటారుపల్లి(గాండ్లపెంట) : మండల పరిధిలోని కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం స్వామివారి గొడుగుల ప్రదక్షిణతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్నారు. సేదతీరేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఆలయం వెలుపల గాజులు, బొమ్మలు, మిఠాయి షాపులు వెలిశాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట జొన్నధాన్యాలతో రాసి పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుంభకూడును(ప్రసాదాన్ని) భక్తులు పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటారు. నేడు బండ్ల మెరవణి వేమన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పందేరం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులు ఎండ్లబండ్లను అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు. -
వేమన శతకం వేనోళ్ల వర్థిల్లు
సందేశం వేమన తన శతకం ద్వారా ఈ లోకంలో మనుషుల తీరు తెన్నులను సులువైన భాషలో, సామాన్యులకు అర్ధమయ్యేటట్లు వివరించాడు. ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయి. ఆ యోగి చెప్పిన బాటలో నడిస్తే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించి, అనుకున్న పనులు సులువుగా సాధించి, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. దైనందిన జీవితంలో మనం నడుచుకోవాల్సిన తీరు సులభంగా ఉండేలా చెప్పాడు వేమన. ‘‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు...’’ ఏ పనైనా సాధన ద్వారా అలవడుతుంది, కేవలం ఒకసారి ప్రయత్నిస్తే లాభం ఉండదు,చేసే పనిపై శ్రద్ధాసక్తులు కనబరిస్తే అది తప్పకుండా సాధ్యపడుతుందని చెప్పిన వేమన పలుకులు అక్షర సత్యం. ‘‘ఆపదైనవేళనరసి బంధుల జూడు’’ బంధువులెవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మన కర్తవ్యం, కానీ మనం చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశిస్తే అది బంధుత్వమే కాదు, స్వార్థం అవుతుందని బంధుత్వాన్ని నిర్వచించాడు వేమన. ‘‘చిక్కియున్నవేళ సింహంబునైనను’’ మనం అశక్తులమైనప్పుడు సహనం వహించడం మంచిది, లేకుంటే ప్రతివారికి చులకనవుతాం, అంటూ ఆవేశం అన్నివేళలా అనర్థదాయకమని మృదువుగా చెబుతాడు శతక కర్త. ‘‘తప్పులెన్నువారు తండోపతండంబు’’ ఇతరుల మీద అనవసరమైన నిందలు మోపుతుంటారు కొందరు, అదే తప్పు వారు చేస్తే మాత్రం కిమ్మనరు. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం అవి మనం కనీసం గుర్తించము, కాని ఇతరుల తప్పులను మాత్రం వెంటనే వేలెత్తి చూపుతాం. ఆత్మస్తుతి, పరనింద చేసే వారు ఆత్మవిమర్శ చేసుకునేలా హితవు పలికాడు వేమన. ‘‘పట్టుబట్టరాదు పట్టివిడువరాదు’’ ఏ పనైనా ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తుంటారు, అది మనతో సాధ్యపడదని తలచి ఆపనిని విరమించుకుంటారు కొందరు, కాని పట్టుదలతో ఏ పనైనా మనం సాధించవచ్చని వేమన ఆనాడే మానవాళికి మంచి చెప్పాడు. ‘‘ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు’’ పరుషంగా మాట్లాడి పరులను బాధపెట్టేవారు, క్షణికావేశంతో ఆ మాటలను అనవచ్చు, కాని ఆ మాట పడ్డవారు అప్పటితో మరచిపోలేరు, అది వారిని చాలా కాలం బాధిస్తుంటుంది అంటూ వైవిధ్యమైన పద్యాలను మనకు అందించాడు యోగి వేమన. ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్వయించగల పద్యాలు వేమన సొంతం. ఆయన పద్యాల్లోని సారం అనిర్వచనీయం. ముఖ్యంగా ఆధునిక సమాజంలోని అవకతవకలను తన నీతి వాక్యాల ద్వారా నవసమాజానికి అందించాడు వేమన. ఆయన పద్యాల్లో కొన్నింటినైనా నేర్చుకుంటే, అది మన వికాసానికి తోడ్పడుతుంది. పెద్దలు చిన్నారులకు రోజుకొక పద్యం చొప్పున నేర్పిస్తే మంచి ఫలితముంటుందనడంలో సందేహం లేదు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు
‘తానా’ అధ్యక్షుడు సతీష్ వేమన రాజమహేంద్రవరం సిటీ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నదని ఈ సంఘం అధ్యక్షుడు (2017) సతీష్ వేమన పేర్కోన్నారు. బుధవారం చైతన్యస్రవంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ తానా 2017 మే 28తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఏటా జూలైలో నిర్వహించే ఉత్సవాలను ఈసారి మే 28నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాలలో తానా కార్యాక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. గన్ని సతీష్‌కు మొక్కను అందజేశారు. ఆయన వెంట సినీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఉన్నారు, -
గొప్పల 'సెల్'ఫీస్...!
హ్యూమర్ ‘‘వేమన ఉన్న రోజుల్లో మేం లేము. ఆయన ఉన్న రోజుల్లో మేం గనక ఉండి ఉంటే...’’ అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది సెల్‌ఫోన్. ‘‘వేమన ఉండి ఉంటే ఏమయ్యేది?’’ అడిగింది ల్యాండ్‌లైన్ హ్యాండ్ సెట్. ‘‘ఏమయ్యేది అని నెమ్మదిగా అడుగుతావేం... ‘చేతిలోన సెల్లు... చెవిలోన హెడ్ఫోను... అరచేత పట్టు ఇంటర్నెట్టు... అందులోనీ ఫేస్‌బుక్‌కు, టాపు రేపు వాట్సాప్పు... చేత సెల్లు లేని బాధ ఇంతింత గాదయా’... అంటూ మమ్మల్ని వర్ణిస్తూ పద్యాలు చెప్పే వాడు. ఇప్పుడు ప్రతివాడూ మా సర్వీస్ తీసుకునే వాడే, మమ్మల్ని తిట్టేవాడే’’ అంది సెల్‌ఫోన్. ‘‘మిమ్మల్ని తిడుతున్నారా... ఎవరూ? ఏమంటున్నారు?’’ అడిగింది హ్యాండ్సెట్. ‘‘మేము వచ్చి మానవ సంబంధాలను మంటగలిపామంట. ప్రతివాళ్లూ మాలోనికి తలదూరుస్తున్నారట. మేం కూడా యథాశక్తి వాళ్ల జీవితాల్లోకి తలదూరుస్తున్నామంట. ఒక్క మాటేమిటీ... పెళ్లిళ్లు కూడా మా ద్వారానే... విడాకులూ మా ద్వారానేనట’’... అంది సెల్‌ఫోన్ బాధగా. ‘‘అరె... ఒక రింగుల రింగుల సంకెళ్ల ద్వారా ఆ ల్యాండ్ఫోన్కి మేం బందీలమయ్యామే. కానీ మీరు అలా కాదు కదా. స్వేచ్ఛగా బహు స్వతంత్రంగా ఉన్నారని మేం మిమ్మల్ని చూస్తూ కుళ్లుకుంటూ ఉన్నామే. మీకు తిట్లు తప్పడం లేదన్నమాట’’ సానుభూతిగా అంది ల్యాండ్‌ఫోన్ హ్యాండ్ సెట్. ‘‘తిట్లా... మామూలుగా కాదు. కర్ణపిశాచి అనీ... అదనీ ఇదనీ. అరె... అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ మాలోనే ఇంతగా తలదాచుకుంటున్నారే...’’ అంటుండగా సెల్‌ఫోన్ మాటల ఫ్లోకి అడ్డుపడింది ల్యాండ్‌ఫోన్. ‘‘తల దాచుకోవడమేమిటి? అసలు తలదాచుకోవడమనే మాటకు అర్థమేమిటో తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి’’ అంటుండగానే రోషంగా తలెత్తింది సెల్‌ఫోన్. ‘‘పెద్ద పెద్ద మాటలేమీ కాదు. ఉన్న వాస్తవమే. ఎవరినైనా పలకరించాల్సి వస్తుందనీ, ఎదుటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని తెలియగానే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాలో తలదాచుకుంటారు. తమ మెదడు తినేసేవాళ్లు అవతలికి పోయారని తెలిసేవరకూ అలా దాచుకున్న తలను మళ్లీ ఎత్తరు. పైగా మేమిప్పుడు మనషులు దారితప్పకుండా చూసే వాళ్ల పాలిటి గైడ్లం కూడా’’ అంది గొప్పగా. ‘‘మీరేంటి గైడ్లేమిటి? ఎందుకలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు’’అంది హ్యాండ్సెట్ అక్కసుగా. ‘‘మేం మనుషుల పాలిటి గైడ్లం అన్న మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ప్రతి కారూ... ప్రతి వాహనమూ తాము దారి తప్పకుండా ఉండటం కోసం మా సహాయం తీసుకుంటున్నారు. తాము వాహనంలో కూర్చుని ఎక్కడున్నదీ... ప్రయాణించాల్సిన రూట్ ఏదీ... ఇవన్నీ తెలిసేలా మాలోనే రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకుని, ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ప్రయాణాలు చేసేవారికి తమ సీటు ఎంత ముఖ్యమో... వాళ్ల గైడ్‌గా మాకూ అంతే ప్రాధాన్యం. డ్రైవింగ్ సీటుకు ఎదురుగా మమ్మల్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ప్రతివాహనంలోనూ మాకో స్టాండు ఏర్పాటు చేస్తున్నారు తెల్సా’’ అంది సెల్‌ఫోను. ‘‘అవును. గతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము తమ హోదాకు చిహ్నంగా మమ్మల్ని భావించేవారు’’ అంటూ ఉండగానే సెల్‌ఫోన్ అడ్డుకుంది. ‘‘ఇప్పుడు మీరు మీ పాత గొప్పల్ని చెప్పుకుంటున్నారే... అప్పుడలా బతికాం అంటూ ఇప్పుడు మీ గత ప్రాభవం గురించి ప్రశంసించుకుంటున్నారు కదా. అలాంటిది ఇప్పుడు మాగురించి పరమ వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు గబుక్కున ‘పొగుడుకోవడం’ అనేశారు మేమెంత హర్టయ్యామో తెలుసా’’ అంది సెల్‌ఫోన్ నిష్ఠూరంగా. ‘‘మేం మోగితే తప్పనిసరిగా మమ్మల్ని ఎత్తుకునే వారు. కానీ మీరు మోగితే ఎదుటివాళ్ల కాల్ తాము తీసుకోనక్కర్లేదని తెలిస్తే ఠక్కున మీ పీక నొక్కేసున్నారు కదా. మాకు అలాంటి అగౌరవాలు ఉండేవి కావు తెలుసా’’ అంటూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకుంది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘నోర్మూసుకోండి. ఇంటర్నెట్తో అనుసంధానమై ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అందిస్తున్న మేమెక్కడ. ఇప్పుడు ఇంటర్‌కమ్ స్థాయికి దిగిపోయిన మీరెక్కడ. ఏదో మా ఆవేదన వెలిబుచ్చుకోవాలనుకుంటే మధ్యన మీ బోడి గొప్పలేమిటి?’’ కోప్పడింది మొబైల్‌ఫోన్. ‘‘ఎంత అందరించిపోయినా డైనోసార్లు డైనోసార్లే... అందుకే ఎంతగా ప్రాచుర్యం పొందినా, ఎంతగా మీమీద మనషులు ఆధరపడ్డా మీరు మీరే. స్టేటస్ సింబల్‌లా మేము మేమే. తమ కుర్చీ కంటే ఎత్తై స్థానంలో పెట్టుకునే మేమెక్కడా... మగాళ్ల జేబుల్లోనూ, ఆడవాళ్ల హ్యాండ్‌బ్యాగుల్లోనూ తలదాచుకునే మీరెక్కడ’’ అంటూ ఈసడించింది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘అంత మిడిసిపడ్డందుకే అంతరించిపోయి డైనోసార్లలా మిగిలారు’’ అంది మొబైల్. ‘‘డైనోసార్‌లో ‘సార్’ అనే మాట ఉంది. సెల్లు అనే మాట సొల్లులా ఉంది. అందుకే పరిమితంగా పనిచేసినామా కాలంలో మేమంటే ఎంతో గొప్ప. మంచి తివాచీ పరిచి మమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకునేవారు. మీరు ఇన్నిన్ని పనులు చేస్తున్నా, డేటూ టైమూ క్యాలెండరూ కెమెరా ఉన్నా మీకు గౌరవం జీరో. పైగా ఏడాదికోసారి కొత్త మోడల్ రాగానే మిమ్మల్ని చెత్త అంటూ పారేస్తారు’’ అంది ల్యాండ్‌లైను ఫోన్. ‘‘చెత్త అయినా, తిట్టుకున్నా సరే... ఇప్పట్లో మేమే మనుషుల చేతి ఆభరణం. మహామహుల తల చుట్టూ చక్రం తిరుగుతున్నట్లుగా... ఫైల్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మాలోనూ అలాంటి చక్రమే తిరుగుతూ ఉంటుంది’’ అంది సెల్. ‘‘అదీ సంగతి. రహస్యం తెలిసిపోయింది. మీకు తలతిరుగుడు ఎక్కువనే సంగతి తెలిసే మనుషులు మీ సేవలు తీసుకుంటూనే మిమ్మల్ని లోకువ కడుతున్నారేమో. అందుకే చేతవెన్నముద్ద పద్యం టైప్‌లో కాకుండా వేమన మిమ్మల్ని చెప్పులో రాయి, చెవిలో జోరిగ టైప్ పద్యం చెబుతాడని మీరన్నది నిజమే’’ అంటూ ‘సెల్’విచ్చింది ల్యాండ్ఫోను. - యాసీన్ -
కిరీటమేమో భారమై ఉన్నది కిందేసితే నడక భలే ఉన్నది
One of the pleasant things in the world is going a journery; but I like to go by myself. I can enjoy society in a room; but out of doors, Nature is company enough for me. I am then never less alone than when alone. ‘ఆన్ గోయింగ్ ఎ జర్నీ’ గురించి విలియం హాజ్లిట్ చెప్పిన మాటలు గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. ‘‘ఏ బంధనాలూ లేకుండా తమ జీవితానుభవంతో లోకానికి మంచిని బోధిస్తూ తిరుగాడిన ఎందరో లోక సంచారులు... పోతులూరి వీరబ్రహ్మం, వేమన.. ముఖ్యంగా శైవదాసులు నాకు ఆదర్శం’’ అన్నాడు వెంకన్న. అదే తత్వానికి అద్దం పడుతూ రాసిన పాట ‘సంచారం’. ‘ఇల్లు పొల్లు లేని, ముల్లె మూట లేని...’ ఐహిక కౌటుంబిక లంపటాలూ, సిరిసంపదల వ్యామోహాలూ లేని సంచారమే ఆనందమంటాడందులో. ‘కిరీటమేమో భారమై ఉన్నది/ కిందేసితే నడక భలే ఉన్నది..’-- మతమూ, కులమూ, సంపదా, హోదా, కీర్తీ లాంటి వాటి వల్ల అహాన్ని పెంచుకుంటే, చివరకు ఆ అహ మే బరువైన కిరీటంగా మారి, గమనానికే ఆటంకమవుతుందని ధ్వనించాడు. ‘మంచుతో మెరిసేటీ కొండున్నది/ మిహ మల తొవ్వెంట సెవ్విన్నది/ కొంచెం ఎడం బోతే ఏదో మేలున్నది/ మురిపాల మెరుపులు అడ్డున్నవి/ దాటిపోతె నడకతీరె వేరున్నది’ అన్నాడు. ఇక్కడ ‘మంచుతో మెరిసే కొండ’ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతీకగా ప్రయోగించానని ఒక ఉపన్యాసంలో ఆయనే చెప్పాడు. పటాటోపాలనూ, ఆడంబ రాలనూ వదులుకున్నప్పుడే జీవిత వాస్తవాన్ని తెలుసుకోగలమనే భావాన్ని ‘పైవన్నీ వదులుకొమ్మన్నది/ పైరగాలి తడిపి పోతున్నది’ అని మార్మికంగా వ్యక్తం చేశాడు. పండిన జానపండు రుచికరంగానే ఉన్నా, దాని గింజ చేదుగా ఉంటుంది. ఆ చేదు గింజను కూడ నమిలే కొద్దీ తీపిని ఇస్తుందన్నాడు. సుఖాల వెనుక ఉండే కష్టాలకూ, ఆనందాల మరుగున దాగిన విషాదాలకూ ప్రతీక చేదుగింజ. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనేది భావం. ‘ఊరి ఊరికి దారులేరున్నవి/ ఊటలోలె బాటలొస్తున్నవి/ వింత వింత పూలు పూసున్నవి/ తోవ ఎంత నడిసిన వొడువకుంటున్నది’-- ఈ సంచారంలోనే వివిధ సిద్ధాంతాలూ, మార్గాలూ, లక్ష్యాలూ, వివిధ నాగరికతలూ, సంస్కృతులూ, వాటిలోని వైవిధ్యాలూ తెలుస్తుంటాయి. ఈ ‘తెలివిడి’ వల్లనే తనకు తెలిసింది చాల తక్కువనీ, తెలుసుకోవలసింది అంతులేనంత ఉన్నదనీ బోధపడుతుంది. ఈ లోకంలో తన అల్పత్వం పట్ల ‘ఎరుక’ కలుగుతుంది. ‘పండితులకూ కవులకూ దేశాటనం అనివార్యమైన విహిత ధర్మం. మానరానిదది. కీర్తి, ధనము మాత్రమే కాదు, అనేకాలు చూడ్డమూ, అనేకాలు వినడమూ, జ్ఞానం పరిణతం కావడమూ, ప్రతిభ నిశితం కావడమూ వంటి అనుభావాలు కలిగి, ప్రౌఢిమ అబ్బుతుంది’’ అన్నారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. ‘గాలిలో తేలాడే గద్దున్నది/ గగనమంచుల దాక పోతున్నది/ ఏటిలో గాలాడే చేపున్నది/ నీటిపాతి దాక ఈతున్నది’-- ఏ బంధాలూ, బంధనాలూ లేని గద్ద, నింగి అంచుల దాక విహరించ గలుగుతున్నదనీ, చేప నీటి అడుగు దాకా ఈద గలుగుతున్నదనీ, భూమ్యాకాశాల మధ్యన ఉన్న మనిషి మాత్రమే మోహపాశ బద్ధుడవుతున్నాడనీ సారాంశం. ‘సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి’ అనే చివరి పంక్తుల్లో rolling stone gathers no moss అన్న వాక్య భావం నిక్షిప్తం చేయబడింది. ఒక సందర్భంలో వెంకన్నే అన్నట్టు, సంచారమంటే ఒక్క కాళ్ళతో తిరగడమనే కాదు, చలనశీలమైన జగత్తులో చేసే నిరంతర ప్రయాణం, ఆలోచనల ప్రయాణం, ఆసక్తుల ప్రయాణం. పాటతో, పదముతో నిత్య పథికుడు గోరటి వెంకన్న. - పెన్నా శివరామకృష్ణ 9440437200 -
దిగంబర యోగికి ఆడంబర నివాళి
నేనొక పెద్ద హీరోకి అభిమానిని. నా హీరో కామెడీ చేయకూడదు - యాక్షనే చెయ్యాలి. నా హీరో కంట తడి పెట్టకూడదు - కొట్టాలి. నా హీరో సినిమాలో వేరే ఆర్టిస్టులు ఏం చెయ్యకూడదు, అన్ని డైలాగులూ హీరోనే మాట్లాడాలి. అందరి మాటలూ హీరోనే చెప్పాలి. నా హీరో సిక్స్‌ప్యాక్ బాడీ చూపించకూడదు. ఎప్పుడూ నిండుగా బట్టలేసుకునే కనిపించాలి. నా హీరో టీవీల్లో కనపడ కూడదు. ఆలస్యమైనా వెండితెర మీదే కనిపించాలి. నా హీరో నాకు నచ్చే సినిమాలే చెయ్యాలి. ఆయనకిష్టమైనవి చేయకూడదు. నేను హీరోకి అభిమానినా? దురభిమానినా? వేరే హీరోకి కోవర్టునా? నా అభిమానంతో నా హీరో చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేసేవాడినా? నా చిన్నప్పట్నుంచి ఘంటసాల, ఎస్పీబీ పాటల కన్నా నేనెక్కువ సార్లు పాడుకున్న పద్యాలు నా సాంస్కృతిక, సారస్వత హీరో వేమన గారివే. ఆయనకి బట్టల్లేవన్న సంగతి నిన్నే ఎవరో రీసెర్చ్ చేసి టీవీ చానళ్లలో గొడవ చేస్తే తెలిసింది. నలభై రెండేళ్ళుగా నా కళ్లు మూసుకుని పోయాయని చాలా బాధపడ్డా. ఇది ఉపోద్ఘాతం. అసలు ఘాతం ఏంటంటే- వేమన జీవితచరిత్ర. పద్యాల సారాంశం. అవి సమాజానికి బోధించే నైతిక విలువల ప్రస్తావన అన్నీ అందరూ ఏళ్ల తరబడి చెప్పేశాక, ఇంక చెప్పడానికి ఏమీలేదని, ఏమీ మిగల్లేదని కొందరు ఆయనకి బట్టలు తొడగాలని తీర్మానించడం... అందుకు చర్యగా ఆయన విగ్రహం మీదున్న ఆయన పేరుని చెరిపేయడం... ఆయన విగ్రహాన్ని స్త్రీలు చూడలేక అసభ్యంగా భావిస్తున్నారని బాధపడడం... జోక్ ఆఫ్ ది మిలీనియమ్. సారీ టు సే. పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ. ఇదొక చర్చ- దీనికింత రచ్చ. బాగా బతికిన జమీందారు పెదకోమటి వేమారెడ్డి స్త్రీలోలుడై ఆస్తిపాస్తులు పోగొట్టుకుని ప్రేమంటే మైకమనీ, జనన మరణాల మధ్య మానవ సంబంధాలు భ్రమలనీ తెలుసుకుని, లుంబిని మహర్షి శుశ్రూషలో యోగ సిద్ధుడైన వ్యక్తి యోగి వేమనగా అవతరించారు. ఆ యోగసిద్ధిలో ఆయన గ్రహించిన జ్ఞానం - బట్టలు, బాహ్యవేషధారణ మనిషి ఆత్మ సౌందర్యాన్ని కప్పిపుచ్చుతోందని! ఆయన పద్యాల సారాంశం కూడా అదే. పురుషులందు పుణ్యపురుషులు వేరయా - అని వేమన ఎప్పుడో చెప్పాడు. లైనిన్ కాటన్ వేసుకున్న పెద్ద మనుషులంతా చూడ్డానికి ఒకేలా ఉంటారు. కానీ లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు నిజంగా ప్రజాసేవకులో, ఎవరు ప్రజాధన భోక్తలో, ఎవరు ప్రజల ముందు వక్తలో..! ఆత్మ సౌందర్యానికి ఆయన్ని ఆయన చిహ్నంగా మార్చుకున్నారనే తప్ప అది సభ్యతకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఎవరికీ అనిపించలేదు. అలా అనిపిస్తే ఆ మహానుభావుణ్ణి కూడా మనం మెటీరియలిస్టిక్‌గా చూస్తున్నామని అర్థం. నగ్నమైన మానవ జీవిత నిజాలకి దర్పణంగా దిగంబరంగా మారిన యోగి. రమణమహర్షి, వేమన, మహాత్మాగాంధీ అందరికీ బట్టలు కప్పేద్దాం. లేదా వీరి పేర్లు చెరిపే ద్దాం. ఆరున్నరవేల సంవత్సరాల భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన వారి చరిత్రలని పట్టు బట్టలతో కప్పేసి మనలా మామూలు మనుషుల్ని చేసేద్దాం. వారు ఆంధ్రా వారా, తెలంగాణా వారా అని కొట్టుకుందాం. ఇలాంటి విపరీత ధోరణులున్న వారందరినీ సంఘాలుగా ఏర్పరచి సమాజాన్ని ఎడ్యుకేట్ చేద్దాం. 2015కు ముందు వేమన, 2015 తర్వాత వేమన అని పిల్లలకు రెండు ఫొటోలు చూపిద్దాం. అన్నేళ్లు బట్టల్లేకుండా ఎందుకుంచారు? అని ఏ పిల్లలైనా అమాయకంగా అడిగితే, సిగ్గుతో చచ్చిపోదాం. ఇదీ వేమన నుండి మనం నేర్చు కున్నది. ఆయనకి మనమిచ్చే నివాళి. ఆయన్ని మనం మననం చేసుకునే విధానం. సారీ వేమనగారూ- మీకు బట్టలు తొడగడానికి ఎవరో ముందుకొస్తే అడ్డుపడడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని దిగం బరంగానే చూడాలన్న కోరికా నాకు లేదు. మీ నుంచి నేను నేర్చుకున్న జీవిత సత్యాలకి నాగరికత ముసుగు తొడిగి మరుగున పడేస్తారేమోనని బాధతోనే ఈ వ్యాసం. తప్పయితే క్షమించండి. కాదనుకుంటే కార్యాచరణకి దారి చూపండి. ఈ విషయం మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధమ్. - వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ సినీ దర్శకుడు -
పనికిరాని చెత్త తొలగించాలంతే!
పద్యానవనం కల్మషంబుడుగక కాన్పింపదందున్న రూపమెవ్వరికైన రూడితోడ తామసంబు లణగ తగవెల్గు జ్ఞానంబు విశ్వదాభిరామ వినుర వేమ! లో చూపు గురించి చాలా మంది తత్వవేత్తలు అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా వేమన. పైపై అవగాహన, మిడిమిడి జ్ఞానం కాకుండా ప్రతి విషయంలోనూ అంతర్లీనంగా ఉండే మర్మాన్నెరగాలంటారు. ఎరుక గొప్పది. అంటే, ఏదైనా ఎరుక కలిగి, కాస్త లోతుగా తెలుసుకొని సదా ప్రజ్ఞతో ఉండమని అర్థం. ఆ ఎరుక సాధించడానికి జ్ఞానం అవసరం. మనం కష్టపడనవసరం లేకుండానే ప్రాపంచికమైన అనేక విషయాలను దృవపడిన ప్రాకృతిక సత్యాలతో సాపేక్షంగా చెప్పాడాయన. పిరికివాని బింకమిదీ అని మేడిపండును ఒలిచినా, తింటూ ఉంటే వేపాకూ తియ్యన అని సాధన మర్మమెరిగించినా, ఉప్పు-కప్పురం లాంటి పురుషుల్లోని వ్యత్యాసాల్ని విడమర్చినా, దేవుడైనా తెలివి ఉంటేనే లెఖ్క అని లాజిక్ చెప్పినా.... వేమనకు వేమనే సాటి! అలతి అలతి పదాల ఆటవెలది అస్త్రాలతో సామాజిక రుగ్మతల మీద ఆయన యుద్దమే ప్రకటించాడు. గడచిన వెయ్యేళ్ల కాలంలో, జన సాహిత్యాన్ని ఉపకరణంగా వాడిన వేమనంతటి సాధాసీదా సంఘ సంస్కర్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఈ చిన్న పద్యంలోనే చూడండి... జ్ఞానం ఎలా లభిస్తుందో చాలా సులభంగా చెప్పాడు. తమస్సు అంటే చీకటి, అజ్ఞానపు చీకటి తొలగాలట. అప్పుడే జ్ఞానమనే వెలుగు ప్రస్పుటమౌతుంది. పద ప్రయోగం కూడా... జ్ఞానం ‘తగవెల్గు' అంటాడు. అంటే, ఎంత అవసరమో అంత అని. జ్ఞానం ఎక్కువయితే కూడా ప్రమాదమే! మేధోశక్తి పరిమితి మించి అతి(పర్వర్షన్)గా వ్యవహరించే ఎంత మంది అతిగాళ్లని మనం చూడట్లేదు! ‘అతి సర్వర్త్ర వర్జయేత్’ అన్నది ఆర్యోక్తి. అవసరాలకు సరిపడా జ్ఞానం అందరికీ కావాల్సిందే. అందుకే, అజ్ఞానాంధకారం తొలగాలన్న ఆశతోనే మనం, ఓ దేవా! నన్ను చీకటి నుంచి వెలుగువైపు నడిపించు, ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని వేడుకుంటాము. అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించుకోవడమూ సాధ్యపడదనే భావనతోనే కావచ్చు, ‘అణగాలి' అనే పద ప్రయోగం చేశారు వేమన. తామసంబులు అన్న బహువచన భావనని మరో అర్థంలోనూ ప్రయోగించి ఉంటాడు. మానవుల గుణాలన్ని మూడు రకాలుగా విభజిస్తారు లాక్షణికులు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. వాటి వాటి పాళ్లు, హెచ్చు తగ్గుల స్థాయిని బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాల నిర్మాణం జరుగుతుందనీ చెబుతారు. రజోగుణం రాజసానికి, గర్వానికి, సాహస-పౌరుషాలకి ప్రతీక అయితే, తమో గుణం రాక్షసత్వానికి, దౌర్జన్యానికి, అతిశయ-అహంకారాలకు ప్రతినిధి అంటారు. ఇక సత్వ గుణం.... వినయం, వివేచన, ఓపిక-సద్యోచన వంటి సకల విధ సాత్వికతకు ప్రతీక. ఈ మూడు, ‘స'త్వ, ‘త'మో, ‘ర'జో గుణాల (అదే క్రమం) మేలు కలయిక ‘స్త్రీ' అని పెద్దలెవరో చెప్పిన మాట అక్షర సత్యమనిపిస్తుంది. స్త్రీ అన్న ఏకాక్షర పదంలో స, త, ర కారాలకు ఎంతెంత వాటా ఉందో, సగటు మహిళలో కూడా దాదాపు అదే పాళ్లలో ఆయా గుణాలుంటాయేమో అనిపిస్తుంది. చుట్టూ ఉండే చెత్తా చెదారం తొలగిపోతే కాని, అందులో దాగి ఉండే రూపం స్పష్టత ఏర్పడదు అని ఒక ప్రకృతి పరమైన సత్యాన్ని సాపేక్షంగా చెబుతూ జ్ఞానమెలా ఆవిష్కృతమౌతుందో వేమన పోల్చి చూపాడు. నిజమే, లోన రూపుదిద్దుకొని ఉన్న ఆకృతిని చూడాలంటే చుట్టూ ఉన్న చెత్తను తొలగించాలి. జ్ఞానాజ్ఞానాలు కూడ అలాంటివే! అయిదారు వందల సంవత్సరాల కింద గొప్ప శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా జగత్ప్రసిద్ధి పొందిన మైఖలాంజిలో చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదిగే గుణం మహనీయులకే సాధ్యమన్నట్టు, తన ప్రతిభకన్నా ప్రకృతికే పెద్ద పీట వేస్తూ ఆయన చెప్పిన మాట వినయానికి పరాకాష్ట వంటిది. ఆయన శిల్పనైపుణ్యానికి అబ్బురపోయిన ఓ పెద్ద మనిషి ‘అబ్బ ఎంత గొప్పగా చెక్కారు!’ అని ప్రశంసిస్తుంటే, మైఖలాంజిలో చాలా వినయంగా స్పందించారట. ‘అబ్బే! అందులో నే చేసిన గొప్ప పనేం లేదు. ఆ శిల్పం అప్పటికే ఆ రాయిలో ఉన్నట్టుంది. అనవసరమైన చెత్తంతా నే తొలగిస్తే, అదుగో... ఆ శిల్పం అలా మిగిలింది!’ - దిలీప్‌రెడ్డి