
సాక్షి, అమరావతి: తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన తొలిసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సత్యసాయి జిల్లా కటారుపల్లెలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు.
మల్లికార్జునరావు స్వయంగా గీసిన వేమన చిత్రపటాన్ని గురువారం ఆవిష్కరించి 19న నిర్వహించనున్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా కటారుపల్లెలో నిర్మించిన వేమన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరిస్తారని తెలిపారు.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వేమన జీవితానికి, ఆయన బోధనలకు, జ్ఞానాన్ని పొందిన విధానానికి రూపం ఇస్తూ తాను చిత్రాన్ని గీశానని, దానిని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలోని మూఢనమ్మకాలను వేమన తన కవిత్వంతో ఖండించి ప్రజలను చైతన్యం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment