
సాక్షి,కరీంనగర్‌క్రైం: సెల్‌ఫోన్, బైక్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన బాలుడు(16) ఇంటర్ చదువుతున్నాడు. తన తల్లిదండ్రులను మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ కొనివ్వమని అడిగేవాడు. కానీ బైక్ నడిపే వయసు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని వారు తిరస్కరించారు. క్షణికావేశంలో శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో...
చింతకుంట కెనాల్‌లో గుర్తుతెలియని శవం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ శివారులోని పోచమ్మ గుడి వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్సై బి.ఎల్లయ్యగౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మత్స్యకారులు చేపలు పడుతుండగా కెనాల్‌లో మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా పోలీసులు మోఖాపైకి వెళ్లి చూడగా 35–45 ఏళ్ల వయస్సు వ్యక్తి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై బ్లూ, వైట్ లైన్స్ కలిగిన హాఫ్ షర్ట్, నలుపు రంగు లోయర్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎడమ చేతి పైభాగంలో నితిన్ అని హిందీలో పచ్చబొట్టు రాసి ఉందన్నారు. కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నందున ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి ఎస్సై–94409 00974, కరీంనగర్ రూరల్ సీఐ–94407 95109, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్: 94944 90268 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య