
శ్రీనివాసులు(ఫైల్)
సాక్షి, తాడిపత్రి: సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో తల్లి మందలించిందని ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాడిపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. తాడిపత్రిలోని ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన తలారి సుబ్బరాయుడు, లక్ష్మి దంపతుల కుమారుడు తలారి శ్రీనివాసులు(17) పుట్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. కుమారుడు ఇటీవల ఎక్కువుగా సెల్‌ఫోన్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసులు సోమవారం ఉదయం పుట్లూరు రోడ్డు రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే జీఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చదవండి: అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు
ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ..