ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,మెట్‌పల్లి(జగిత్యాల): సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి పట్టణంలోని బర్కత్‌పురాకు చెందిన షేక్ నజీముద్దీన్(18) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తుండటాన్ని గమనించిన తండ్రి ఖుత్బుద్దీన్ రెండు రోజుల క్రితం అతన్ని మందలించాడు.
దీనికి మనస్తాపం చెందిన నజీముద్దీన్ గత నెల 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. బాధిత కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం కోరుట్ల మండలం ఎఖిన్‌పూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్‌లో స్థానికులకు అతని మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్ పేర్కొన్నారు.
చదవండి: Amberpet: తల్లి చిన్నప్పుడే మృతి.. నాన్న మరొకరిని పెళ్లి చేసుకోవడంతో
Comments
Please login to add a commentAdd a comment