reprimand
-
ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి..
సాక్షి,మెట్పల్లి(జగిత్యాల): సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని బర్కత్పురాకు చెందిన షేక్ నజీముద్దీన్(18) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తుండటాన్ని గమనించిన తండ్రి ఖుత్బుద్దీన్ రెండు రోజుల క్రితం అతన్ని మందలించాడు. దీనికి మనస్తాపం చెందిన నజీముద్దీన్ గత నెల 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. బాధిత కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం కోరుట్ల మండలం ఎఖిన్‌పూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో స్థానికులకు అతని మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్ పేర్కొన్నారు. చదవండి: Amberpet: తల్లి చిన్నప్పుడే మృతి.. నాన్న మరొకరిని పెళ్లి చేసుకోవడంతో -
కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు
రాజ్ కోట్: ఐపీఎల్ లో ఆటగాళ్లకు మందలింపుల పర్వం కొనసాగుతోంది. చీవాట్లు తిన్న వారి సరసన కొత్త పెళ్లికొడుకు రవీంద్ర జడేజా కూడా చేరాడు. పంబాబ్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇప్పటికే మందలింపులు ఎదుర్కొన్నారు. తాజాగా గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ జడేజా ఈ లిస్టులో చేరాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడు మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో జడేజాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడించింది. కాగా, రవీంద్ర జడేజా ఏప్రిల్ 17న రాజ్ కోట్ లో పెళ్లిచేసుకున్నాడు. వివిధ కారణాలతో డు ప్లెసిస్, కోహ్లి, శరణ్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్నారు. -
'నాపై చర్య తీసుకునే దమ్ము ఎవరికీ లేదు'
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హా మరోసారి పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ పెద్దలు తనను పక్కన బెట్టడంపై ఆయన ఇంకా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తనపై, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పార్టీ ఎంపీ ఆర్కే సింగ్‌పై చర్యలు తీసుకునే అధికారం బీజేపీలో ఎవరికి లేదంటూ శత్రుఘ్నసిన్హా మండిపడ్డారు. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహించాలన్న అగ్రనేతల నిర్ణయాన్ని ఆయన మరోసారి తోసిపుచ్చారు. బిహార్ ఎన్నికల ఓటమికి బాధ్యులైనవారే అందుకు గల కారణాలు వెల్లడించాలని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. బిహారీ 'సింహం' ఆర్కే సింగ్ చెసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. మా ఇద్దరిపై చర్యలు తీసుకోవడం, మందలించే అధికారం, ధైర్యం పార్టీకి చెందిన నేతల ఎవరి డీఎన్ఏలోనూ లేదంటూ విరుచుకుపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్స్‌కు పార్టీ టిక్కెట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారన్న కారణంగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హాకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. స్థానిక నేతలను పక్కనపెట్టి, స్థానికేతరులతో ప్రచారం చేయించినందునే బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన విషయం అందరికీ విదితమే.