కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు | Ravindra Jadeja reprimanded for showing dissent at umpire's decision | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు

Published Mon, May 2 2016 9:52 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు - Sakshi

కొత్త పెళ్లికొడుక్కి చివాట్లు

రాజ్ కోట్: ఐపీఎల్ లో ఆటగాళ్లకు మందలింపుల పర్వం కొనసాగుతోంది. చీవాట్లు తిన్న వారి సరసన కొత్త పెళ్లికొడుకు రవీంద్ర జడేజా కూడా చేరాడు. పంబాబ్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇప్పటికే మందలింపులు ఎదుర్కొన్నారు. తాజాగా గుజరాత్ లయన్స్ ఆల్-రౌండర్ జడేజా ఈ లిస్టులో చేరాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని మందలించారు. ఐపీఎల్ కోడ్ ఆర్టికల్ 2.1.4 ప్రకారం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడు మందలింపుకు గురయ్యాడు. ఇది లెవల్-1 ఉల్లంఘన కావడంతోపాటు, మొదటి తప్పు కావడంతో జడేజాను హెచ్చరించి వదిలేశారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడించింది. కాగా, రవీంద్ర జడేజా ఏప్రిల్ 17న రాజ్ కోట్ లో పెళ్లిచేసుకున్నాడు. వివిధ కారణాలతో డు ప్లెసిస్, కోహ్లి, శరణ్ మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement