
కోల్‌కతా : ఇండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధను జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరలు అమ్మే దుకాణంలో పనిచేసే రాహుల్ లోహర్(23) టీమ్ ఇండియాకు వీరాభిమాని. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు రాహుల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ ఉత్తమ్ సుర్ తెలిపారు.
ఆదివారం రాహుల్ షాప్‌కు వెళ్లలేదని,ప్రొజెక్టర్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశాడని ఉత్తమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే తాను వెళ్లి రాహుల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు.
ఇదీచదవండి..వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్