‘నా మరణానికి నేనే కారణం.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే సర్వనాశనం’ | Karnataka: Man Suicide In Field Against Police Behaviour | Sakshi
Sakshi News home page

‘నా మరణానికి నేనే కారణం.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే సర్వనాశనం’

Published Sun, Mar 19 2023 10:33 AM | Last Updated on Sun, Mar 19 2023 10:59 AM

Karnataka: Man Suicide In Field Against Police Behaviour - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: పోలీసులకు సమాచారమిస్తే నా జీవితం నాశనమైందని డెత్‌నోట్‌ రాసి యువకుడు ఒకరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా తావంశి శనివారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆకాశ్‌ మహదేవ మిర్జీ (22) మృతుడు. ఆకాశ్‌ అథణి పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎంసీ కాలేజీలో బీకాం రెండవ ఏడాది చదువుతున్నాడు.

ఏం గొడవ జరిగిందో కానీ గ్రామానికి సమీపంలోని ఒక తోటలో ఉరి వేసుకున్నాడు. అథణి పోలీసులు కేసు నమోదు చేశారు. నా మరణానికి నేనే కారణం. మా కుటుంబం, అమ్మాయి కాదు. ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వెళ్తే వారి కుటుంబం సర్వనాశనం అవుతుందంటూ డెత్‌నోట్‌లో రాసి ఉంది.

చదవండి: అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement