
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి ఆదివారం అర్ధరాత్రి హెల్మెట్ ధరించకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ మద్యం సేవిస్తూ దూసుకుపోతున్న ఓ బైక్‌ను అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వాహనదారుడు ఫొటోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. అంతే కాకుండా ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా చేతుల్లో బీరు సీసాలతో రోడ్డువెంట వెళ్లేవారిని న్యూసెన్స్ చేస్తూ పోతున్నారంటూ ఆ వాహనదారుడు ట్వీట్ చేశాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఈ ఘటన ఎక్కడ జరిగిందంటూ ఆరా తీశారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఎల్వీ ప్రసాద్ విగ్రహం పక్క నుంచి అంటూ సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సదరు వాహనాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. స్కూటర్ నెంబర్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బైక్ నెంబర్ ఆధారంగా చిరునామా పట్టుకున్నట్లుగా తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించే దిశలో పోలీసులు యత్నిస్తున్నారు. పట్టాపగ్గాలు లేకుండా రోడ్డుపై మద్యం సేవిస్తున్న యువకులపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Beverage na kodukulu. Triple ride with beers. Scooty meeda kanipinche ammailni kelikkuntaa potnaru ❌ @hydcitypolice pic.twitter.com/3Tw98tI56c
— Joyyyyy (@JacksonBr0) May 1, 2022
చదవండి: వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్