రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి | two bykes Collided, one person died | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

Published Sun, Aug 14 2016 11:24 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

two bykes Collided, one person died

సూర్యాపేటరూరల్‌ : రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, సోలిపేట గ్రామాల మధ్య రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌ గ్రామానికి చెందిన అంతటి నర్సయ్య(33) అర్వపల్లి మండలంలో బంధువుల ఇంటికి పండుగకు వెళ్లాడు. తిరిగి 7 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఇదే క్రమంలో తుంగతుర్తి మండలం శాంతినగర్‌కు చెందిన కలీం రామచంద్రాపురం వైపు నుంచి తుంగతుర్తికి బైక్‌పై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అంతటి నర్సయ్య అక్కడిక్కడే మృతి చెందగా, కలీంకు చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. బైక్‌లు రెండు దెబ్బతిన్నాయి. వెంటనే 108 సిబ్బంది గాయాలపాలైన కలీంను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement