ఈ మేకలకు నేనే.. మేస్త్రీ | Monkey Raid On Goat | Sakshi
Sakshi News home page

ఈ మేకలకు నేనే.. మేస్త్రీ

Published Wed, Apr 4 2018 12:28 PM | Last Updated on Wed, Apr 4 2018 12:28 PM

Monkey Raid On Goat - Sakshi

మేకపై కూర్చున్న వానరం

గోస్పాడు: ముఠామేస్త్రీ సినిమాలో చిరంజీవి పాడుకున్నట్లు ఇదిగో ఇక్కడో ఓ వానరం నడవడం కూడా ఎందుకని ఓ మేకపై కూర్చుని ఆ గుంపుకు మేస్త్రీ తరహాలో చిరంజీవిలా తెగఫీలైపోతోంది. ప్రతిరోజూ ఓ మేకపై కూర్చొని మంద వెంట పొలానికి వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం ఈ వానరానికి పెద్ద ఫ్యాషనైపోయింది. గోస్పాడు మండలం రాయపాడు వద్ద ఈ దృశ్యం సాక్షి కెమెరాకు దొరికింది. బనగానపల్లె మండలం టంగుటూరుకు చెందిన గుర్రప్పతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా   ఈ వానరం నిత్యం అతని గొర్రెల మంద వెంటే ఉంటుంది. ప్రతిరోజూ అతనితోపాటు మేకలపై కూర్చొని పొలానికి వెళ్తుంది. తిరిగి మేకలపై కూర్చొని ఇంటికి వస్తుంది. ఈ దృశ్యాన్ని గమనించిన జనం ‘అహా.. ఏమీ ఈ వానరుని దర్జా ’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement