
అందాల కథానాయిక మంజు వారియర్‌కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు.
‘నేను కూడా రైడర్‌ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్‌ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్‌గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్‌లో మంజు వారియర్‌కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది.