
జెంటర్ షేర్ చేసిన ఫొటో
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మహిళా మంత్రి జూలీ అన్నే జెంటేర్ పెద్ద సాహసమే చేశారు. 42 వారాల గర్భవతి అయిన ఆమె సైకిల్ మీద డెలివరీ వార్డ్‌కు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గ్రీన్ ఎంపీ అయిన జెంటర్ సైక్లిస్ట్. దీంతో ఆదివారం డెలివరీ కోసం ఆసుపత్రికి స్వయంగా సైకిల్ తొక్కుతూ వెళ్లారు. తన నివాసం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలోని అక్లాండ్ సిటీ హస్పిటల్‌కు సైకిల్‌తోనే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను ఆమెనే స్వయంగా ‘ నేను, నా భాగస్వామి సైకిల్ తొక్కాం. ఎందుకంటే కారు సిబ్బంది పట్టే స్థలం అందులో లేదు. ఇది నాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది’ అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. న్యూజిలాండ్ రవాణశాఖ మంత్రి కూడా జెంటరే. ఇక ఆమె చేసిన పనిని సహచర ఎంపీలు కూడా అభినందిస్తున్నారు. ఇంకా బిడ్డకు జన్మనివ్వలేదని ఆమె పార్టీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవలే ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ కూడా ఓ పాపకు జన్మనిచ్చిచ్చారు. ప్రధాని హోదాలో బిడ్డకు జన్మనిచ్చిన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనర్జీ బుట్టో తర్వాత రెండో వ్యక్తిగా జెసిండా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment