ఫరీబా హషిమి, యుల్డుజ్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒలింపిక్స్‌లో తమ దేశం తరుపన సత్తాచాటాలని ఎన్నో కలలు కన్నారు. విశ్వవేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని తహతహలడారు. కానీ విధి మాత్రం మరోలా తలపిచింది.
సొంత దేశమే వారికి అండగా నిలవలేదు. వారి కలను ఆదిలోనే తుంచేయాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలలు క్రీడల్లో పాల్గోకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఆ అక్కచెల్లెల్లు మాత్రం ఎక్కడా నిరాశచెందలేదు. విశ్వక్రీడలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏకంగా దేశాన్ని విడిచి మరి ఒలిపింక్స్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యారు.
తమ కలలను మరో వారం రోజుల్లో సాకారం చేసుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఇదింతా ఏ దేశమే కోసమో ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ దేశమే తాలిబాన్లు పరిపాలిస్తున్న అఫ్గానిస్తాన్. ప్యారిస్ ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ అఫ్గాన్ సైక్లిస్ట్ సిస్టర్ల స్టోరీపై ఒ లుక్కేద్దాం.
అఫ్గాన్ ధీర వనితలు..
2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆధీనంలో తీసుకున్నాక మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఫరీబా హషిమి, యుల్డుజ్ తమ కలలను సాకారం చేసుకునుందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ సైక్లిస్ట్‌ల తరలింపు కోసం ఇటలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.
దీంతో ఫరీబా, యుల్డుజ్ సైతం ఇటలీ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడ వెళ్లాక సరైన కోచింగ్‌ను పొందేందుకు ఇటలీలోని సైక్లింగ్ టీమ్‌లో ఈ అఫ్గాన్ సోదరిలు చేరారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌లో ఏవోసీ(అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన అఫ్గాన్ జట్టును ప్రకటించింది.
అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఫరీబా హషిమి, యుల్డుజ్‌లు చోటుదక్కించుకున్నారు. దీంతో ఒలిపింక్స్‌లో పాల్గోవాలన్న తమ కలను నేరువేర్చుకునేందుకు ఈ అక్కచెల్లెల్లు అడుగు దూరంలో నిలిచారు.
మాకంటూ ప్రత్యేకమైన బలమేమి లేదు. మాకు మేమే బలం. నేను ఆమెకు ధైర్యంగా ఉంటాను. ఆమె నాకు సపోర్ట్‌గా ఉంటుంది: యుల్డుజ్
ఒలింపిక్స్‌లో పాల్గోనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మేము సాధించిన ఈ ఘనతను అఫ్గానిస్తాన్ మహిళలకు అంకితమివ్వాలనకుంటున్నాము. ఎందుకంటే వారి వాళ్లే మేము ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాము.
మా హక్కులను కాలరాసినప్పటకి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. ఈ విశ్వక్రీడల్లో మేము 20 మిలియన్ల ఆఫ్ఘన్ మహిళల తరపున ప్రాతినిథ్యం వహిస్తాము: ఫరీబా
Comments
Please login to add a commentAdd a comment