![Heavy Rainfall to Eastern Afghanistan](/styles/webp/s3/article_images/2024/07/17/afghanistan.jpg.webp?itok=ueamvreM)
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.
వర్షాల కారణంగా నంగర్‌హార్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.
భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్‌హార్‌లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment