సాక్షి, హైదరాబాద్: నగరంలో కొంతకాలంగా సైక్లిస్టుల సంఖ్య పెరిగింది. ఆఫీసులకు వాహనాలకు బదులు సైకిల్‌నే వినియోగిస్తున్నారు. ఈ అవగాహన పెంచడంలో సిటీలోని సైక్లింగ్ క్లబ్‌లు, కమ్యూనిటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్యం కూడా సైక్లిస్టుల సౌకర్యార్థం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేసింది.
వాహనాలకు బదులు సైకిళ్లను వాడాలని, కాలుష్య నివారణకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని ‘హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్’ సభ్యులు నినదిస్తున్నారు. యాక్టివ్ మొబిలిటీ కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఆదివారం ‘హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ 3.0’ పేరుతో సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 5 వేల మంది సైక్లిస్టులు పాల్గొననున్నారు.
సైక్లింగ్ కమ్యూనిటీ పెరుగుతోంది..
నగరంలో 93 లక్షల జనాభాలో దాదాపు 50 లక్షల మందిని యాక్టివ్ మొబిలిటీ వైపు మళ్లించేలా, దూరాన్ని బట్టి నడక, సైకిల్, బస్సు, మెట్రోలను వినియోగించేలా అవగాహన కల్పించేందుకు ఈ సైక్లింగ్ రివల్యూషన్ 3.0 ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం మూడోసారి. నగరం వేదికగా పదివేల మందితో సైక్లింగ్ కమ్యూనిటీ ఉంది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
– శాంతనా సెల్వన్, హైదరాబాద్ సైకిల్ మేయర్
Comments
Please login to add a commentAdd a comment