
A video of a customer preparing his own juice: ఇంతవరకు వింతైన వంటకాలను సంబంధించి రకరకాల వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. అంతేందుకు పాములా అనిపించే విచిత్రమైన కేకులు, ఓరియా బిస్కెట్ పకోడిలు వంటి వెరైటీ వంటకాలను గురించి విన్నాం. అచ్చం అలానే అహ్మాదాబాద్‌కి జ్యూస్ షాప్ సైకిలింగ్ చేయండి జ్యూస్‌ని ఆస్వాదించండి అంటూ మంచి సైకిల్ జ్యూస మిషన్‌ని తయారు చేసింది.
(చదవండి: వలసదారులను తీసుకువెళ్లుతున్న పడవ బోల్తా....11 మంది మృతి)
అసలు విషయంలోకెళ్లితే... అహ్మదాబాద్ గ్రీయోబార్ జ్యూస్ షాప్ తమ షాప్‌లో కస్టమర్‌లు తమకు నచ్చిన జ్యూస్‌ని తామే తయారు చేసుకుని ఆస్వాదించవచ్చు అంటోంది. పైగా మీరు తగిన ఫిట్‌నెస్ తోపాటుగా మంచి జ్యూస్‌ని ఆస్వాదించే అవకాశం కూడా లభిస్తోంది అని చెబుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే జ్యూస్ మిక్సర్ సైకిల్‌కి అటాచ్ చేసి ఉంటుంది. దీంతో మనం ఆ సైకిల్‌ని తొక్కితేనే జ్యూస్ తయారవుతుంది అదే ఈ జ్యూస్ సైకిల్ ప్రత్యేకత. ఈ మేరకు మోహిత్ కేస్వానీ అనే కస్టమర్ ఈ జ్యూస్ సైకిల్‌ని తొక్కుతూ తనకు నచ్చిన పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!)