
సైకిల్ సవారీ ఆరోగ్యదాయకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ చెప్పారు
అరండల్‌పేట(గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ చెప్పారు. ఇండియా సైకిల్ క్లబ్ దేశవ్యాప్తంగా ఐ రైడ్ విత్ ఇండియా పేరుతో ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం నగరంలోని గుంటూరు సైకిల్‌క్లబ్, సాయిభాస్కర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లక్ష్మీపురం, శంకర్‌విలాస్, మీదుగా మెడికల్‌క్లబ్ వరకు జరిగిన ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజారాణి జెండా ఊపి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఆరోగ్యదాయకమే కాకుండా పర్యావరణ హితమన్నారు. దేశవ్యాప్తంగా ఐ రైడ్ విత్ ఇండియా పేరుతో 132 నగరాల్లో ఏకకాలంలో సైకిల్ ర్యాలీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఇందుకోసం వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని, ఇందులో సైకిలింగ్ ప్రధాన పాత్రపోషిస్తుందన్నారు.
సాయిభాస్కర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు సైక్లింగ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైక్లింగ్‌తోపాటు నడక ఆరోగ్య ప్రయదాని అని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు సైకిల్‌క్లబ్ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌కుమార్, డాక్టర్ శిరీష, డాక్టర్ తారకనాధ్, డాక్టర్ ఫర్నీకుమార్, డాక్టర్ రామ్‌కుమార్, డాక్టర్ సురేష్‌కుమార్, డాక్టర్ విద్య, వైద్యులు పాల్గొన్నారు. 150 మంది సైకిల్‌ర్యాలీలో పాల్గొన్నారు.