స్టేట్ మీట్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి.
సాక్షి, హైదరబాద్: స్టేట్ మీట్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. ఉస్మానియాలోని సైక్లింగ్ ట్రాక్‌పై అండర్-17 బాలబాలికల విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. టైమ్ ట్రయల్ బాలుర విభాగంలో అజయ్ కుమార్ (హైదరాబాద్)... బాలికల విభాగంలో స్వర్ణ కుమారి (హైదరాబాద్) విజేతలుగా నిలిచారు. మాస్ స్టార్ట్ విభాగంలోనూ నగరానికి చెందిన తనిష్క్ అగ్రస్థానంలో నిలవగా... బాలికల విభాగంలో చైతన్య (వరంగల్) మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
ఇతర విజేతల వివరాలు
టైమ్ ట్రయల్ బాలురు: 1. అజయ్ కుమార్ (హైదరాబాద్), 2. రిషింద్ర (రంగారెడ్డి), 3. ఆదిత్య (హైదరాబాద్), 4. బి.జయ సూర్య (కరీంనగర్). బాలికలు: 1. స్వర్ణ కుమారి (హైదరాబాద్), 2. వైష్ణవి (హైదరాబాద్), 3. శిరీష (కరీంనగర్), 4. స్రవంతి (వరంగల్). మాస్ స్టార్ట్ బాలురు: 1. తనిష్క్ (హైదరాబాద్), 2. రాజ్ కుమార్ (హైదరాబాద్), 3. శశిధర్ (వరంగల్), 4. సారుు కిరణ్ (కరీంనగర్).
బాలికలు: 1. చైతన్య (వరంగల్), 2. వన్షిక (హైదరాబాద్), 3. మమత (కరీంనగర్), 4.అర్చన (వరంగల్).