ఓవరాల్ చాంప్ డెలాయిట్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఒలింపిక్స్‌లో డెలాయిట్ ఉద్యోగులు సత్తాచాటారు. దీంతో డెలాయిట్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. మొత్తం 17 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో డెలాయిట్ క్రీడాకారులు 26 స్వర్ణాలు, 17 రజతాలు, 25 కాంస్య పతకాలతో కలిపి 68 పతకాలు సాధించారు. ఈ పోటీల్లో హెచ్‌ఎస్‌బీసీ-ఈడీపీ ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది. వికలాంగ అథ్లెట్ కిరణ్ కానోజియా బ్లేడ్ సాయంతో పరుగెత్తి అందరినీ ఆకట్టుకుంది. 800 మీటర్ల పరుగులో ఆమె కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా నిర్వాహకులు ప్రత్యేక బహుమతిని అందజేశారు.
పురుషుల 100 మీ. పరుగులో సమిరన్ భరద్వాజ్ (డెలాయిట్) 12.66 సెకన్లలో పోటీని పూర్తిచేసి స్వర్ణం సాధించాడు. చార్లెస్ బిన్నీ, రాజ్ కుమార్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. 200 మీటర్ల పరుగు పందెంలో అర్జున్ మారి (డెలాయిట్) పోటీని 25.12 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రాజ్ కుమార్ (డెలాయిట్), కశ్యప్ (హెచ్‌ఎస్‌బీసీ-ఈడీపీ) వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. రవీందర్ (డెలాయింట్) ఉత్తమ పురుష అథ్లెట్‌గా, జయంతి పాఠక్ (వెరిజాన్) ఉత్తమ మహిళా అథ్లెట్‌గా అవార్డులు గెలుపొందారు. ఏడీపీ బృందం స్ఫూర్తిదాయక జట్టుగా, టీసీఎస్ క్రమశిక్షణ జట్టుగా, వెరిజాన్ ప్రేరణ ఇచ్చిన జట్టుగా అవార్డులు దక్కించుకున్నాయి.